The Greatest of All Time: ‘ది గోట్’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • September 5, 2024 / 06:52 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) హీరోగా తెరకెక్కిన ‘ది గోట్'(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’) (The Greatest of All Time) చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో స్నేహ (Sneha) , లైలా (Laila) వంటి సీనియర్ హీరోయిన్లు కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ (Prashanth), జయరామ్ సుబ్రహ్మణ్యం (Jayaram), ప్రభు దేవా (Prabhudeva) వంటి స్టార్లు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

The Greatest of All Time

వెంకట్ ప్రభు  (Venkat Prabhu)  ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.విజయ్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉండటంతో ‘ది గోట్’ కి మంచి బిజినెస్ జరిగింది. ఓ రకంగా ఇది విజయ్ కెరీర్లో తెలుగులో అత్యధిక బిజినెస్ చేసిన మూవీ అని చెప్పవచ్చు. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 8.00 cr
సీడెడ్ 3.00 cr
ఉత్తరాంధ్ర 2.90 cr
ఈస్ట్ 1.50 cr
వెస్ట్ 1.30 cr
గుంటూరు 1.50 cr
కృష్ణా 1.60 cr
నెల్లూరు 0.90 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 20.70 cr

‘ది గోట్’ (The Greatest of All Time ) చిత్రానికి తెలుగులో రూ.20.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ అయితే చిన్నది కాదు.., మరి బాక్సాఫీస్ వద్ద అంత టార్గెట్ రీచ్ అవ్వాలంటే స్ట్రాంగ్ మౌత్ టాక్ రావాలి.

పారితోషికం తగ్గించుకుని నిర్మాతని ఆదుకున్న రవితేజ.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus