The Legend: ఆ ఓటీటీలో మోస్ట్ ట్రోలింగ్ మూవీ.. హిట్టవుతుందా?

Advertisement

తమిళనాడులోని ప్రముఖ వ్యాపారవేత్తలలో అరుళ్ శరవణన్ ఒకరు కాగా ఈ నటుడు గతేడాది నటించిన ది లెజెండ్ సినిమా గతేడాది జులై 28వ తేదీన థియేటర్లలో విడుదలై ఫ్లాప్ గా నిలిచింది. మోస్ట్ ట్రోలింగ్ మూవీగా వార్తల్లో నిలిచిన ఈ సినిమా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకోలేదు. ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించినా ఈ సినిమా ఫలితం మాత్రం మారలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం కొంతమంది ఆసక్తిగా ఎదురుచూడగా ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండటం గమనార్హం. పెద్దగా ప్రచారం లేకుండానే ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతూ వార్తల్లో నిలిచింది. అరుళ్ శరవణన్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఓటీటీలో ఈ సినిమా అందుబాటులోకి రావడంతో ఈ సినిమాపై ట్రోల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

అయితే అరుళ్ శరవణన్ ట్రోల్స్ ను పెద్దగా పట్టించుకోరనే సంగతి తెలిసిందే. 53 సంవత్సరాల వయస్సులో అరుళ్ శరవణన్ ఈ సినిమాలో నటించడం గమనార్హం. 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కగా అరుళ్ శరవణన్ పబ్లిసిటీ కోసమే ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా రిలీజైన ఏడు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం గమనార్హం.

మొదట ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాదని ప్రచారం జరగగా అందుకు భిన్నంగా ఈ సినిమా హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. అరుళ్ శరవణన్ రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus