Devara Movie: దేవర 1 క్లైమాక్స్ అలా ఉండనుందా.. దేవర2 సీక్వెల్ కు లీడ్ ఇదేనా?

కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దేవర మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. అయితే బాహుబలి మూవీకి దేవర మూవీకి లింక్ ఉందని సమాచారం అందుతోంది. బాహుబలి క్లైమాక్స్ లో అమరేంద్ర బాహుబలి గురించి షాకింగ్ ట్విస్ట్ తో ఆ సినిమా ఏ విధంగా ఎండ్ అవుతుందో దేవర సినిమా కూడా అదే విధంగా షాకింగ్ ట్విస్ట్ తో ఎండ్ కానుందని తెలుస్తోంది.

దేవర (Devara) సీక్వెల్ సెకండ్ రోల్ ఎంట్రీతో మొదలుకానుందని తెలుస్తోంది. దేవర1 సక్సెస్ సాధించిన విధంగానే దేవర2 కూడా సక్సెస్ సాధించే ఛాన్స్ అయితే ఉందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. దేవర1, దేవర సీక్వెల్ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాపై అంచనాలు ఊహించని స్థాయిలో పెరుగుతుండగా ఈ సినిమా బడ్జెట్ సైతం హద్దులు దాటుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషలపై కూడా ఫోకస్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. బాలీవుడ్ లో కూడా మార్కెట్ ను పెంచుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్న నేపథ్యంలో తారక్ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది. కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తారక్ తర్వాత సినిమాలు తెరకెక్కుతున్నాయి.

ఈ సినిమాలు సైతం భారీ బడ్జెట్ తో భారీ లెవెల్ లో తెరకెక్కుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుండగా తారక్ తో సినిమాలు చేయాలని ఆశ పడుతున్న దర్శకనిర్మాతల జాబితా పెరుగుతోంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus