దేశభక్తి రగిలించిన చిత్రాలు

  • January 24, 2017 / 02:06 PM IST

సినిమా అనేది వినోదాన్ని పంచే మీడియా. థియేటర్ కి వచ్చిన వారిని మూడు గంటల పాటు ఎంటైర్ టైన్ చేయడమే మూవీ లక్ష్యం. అందుకు తగినట్లుగానే కథలను ఎంచుకుంటుంటారు. కానీ కొంతమంది డైరక్టర్లు దేశ భక్తి రగిలించే కథలతో మూవీలు చేశారు. విజయాల్ని సొంతం చేసుకున్నారు. మన హీరోలు స్వాతంత్ర సమర యోధులుగా, దేశాన్ని రక్షించే వీరులుగా కనిపించి ఆకట్టుకున్నారు. అలాంటి సినిమాలపై ఫోకస్..

అల్లూరి సీతారామ రాజుబ్రిటీష్ వారిని ఎదిరించిన మన్యంవీరుడు అల్లూరి జీవితాన్ని ఆధారం చేసుకొని చేసిన చిత్రం అల్లూరి సీతారామ రాజు. సూపర్ స్టార్ కృష్ణ అల్లూరిగా అద్భుతంగా నటించారు. 70 వ దశకంలో వచ్చిన ఈ చిత్రం చూస్తున్న సేపు రోమాలు నిక్కపొడుచుకునేల చేస్తుంది.

బొబ్బిలి పులిసైనికుడిగా సేవలందించిన వ్యక్తి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను రూపుమాపాలని రెబల్ గా మారుతాడు. ఈ కథాంశంతో దాసరి నారాయణ రావు తెరకెక్కించిన బొబ్బిలి పులి చిత్రంలో మహానటుడు నందమూరి తారకరావు పాత్రకు ప్రాణం పోసి దేశభక్తిని రగిలించారు.

ఆంధ్ర కేసరిచంపమని బ్రిటిష్ వారికి చొక్కా విప్పి గుండెని చూపించిన మరో తెలుగు వీరుడు టంగుటూరి ప్రకాశం. ఆయన జీవితాన్ని ఆధారం చేసుకుని మలిచిన మూవీ ఆంధ్ర కేసరి. ఈ పాత్రకు విజయ్ చందర్ బాగా సూటయ్యారు. ఆయనలో ప్రేక్షకులు టంగుటూరిని చూసుకొని చైతన్యం పొందారు.

వందేమాతరంటి.కృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేశభక్తి చిత్రం వందేమాతరం. రాజశేఖర్, విజయ శాంతిలు చక్కగా నటించి సినిమా విజయానికి దోహదం చేశారు. 1985 లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఆనాటి పరిస్థితులకు అద్దం పట్టింది.

ఖడ్గంకులాలు, మతాలు వేరైనప్పటికీ భారతీయులందరిలో దేశభక్తి సమానంగా ఉంటుందని, దేశద్రోహులను అంతమొందించడానికి ప్రాణాలు సైతం అర్పిస్తారని క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశీ తన ఖడ్గం సినిమాలో చూపించారు. అందరితో ఉత్తమ చిత్రంగా ఇది అభినందనలు అందుకుంది.

ఆజాద్అన్ని రకాల కథలను చేసి హిట్స్ సొంతం చేసుకున్న అక్కినేని నాగార్జున దేశభక్తి కథతో విజయాన్ని, మంచి పేరును దక్కించుకున్నారు. సినిమాలో భారత దేశాన్ని పేల్చేయాలని ద్రోహులు పన్నిన కుట్రను నాగార్జున భగ్నం చేస్తాడు. దేశాన్ని రక్షించడం పోలీసుల భాద్యత మాత్రమే కాదని ప్రతి పౌరుడి విధి అని ఈ చిత్రం ద్వారా చెప్పారు.

మహాత్మఖడ్గం లో సీరియస్, సిన్సియర్ పోలీసాఫీసర్ గా నటించి మెప్పించిన శ్రీకాంత్ చేసిన మరో దేశభక్తి మూవీ మహాత్మ. దీనిని కృష్ణవంశీనే డైరక్ట్ చేశారు. గాంధీజీ విగ్రహాలకు దండలు వేయడం కాదు, ఆయన చెప్పిన మంచి మాటలను పాటించాలని ఇందులో రౌడీ పాత్ర ద్వారా గుర్తు చేశారు.

ఠాగూర్ప్రాణాలు ధారపోసి తెల్లవాళ్ళను తరిమి కొడితే.. కనిపించకుండా అవినీతి ప్రజల్ని కష్టాల పలు చేస్తోంది, దానిని అంతమొందించడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి ఠాగూర్. లంచమనే మాట వినిపించకూడదని అవినీతి పరుల గుండెల్లో భయాన్ని కగిలిస్తాడు. ఠాగూర్ గా చిరంజీవి నటించి సినిమాను కమర్షియల్ హిట్ చేయించారు.

సుభాష్ చంద్ర బోస్స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వాడితో చేతులు కలిపి భారతీయుడే మరో భారతీయున్ని చంపేందుకు ప్లాన్ చేస్తే అంతకన్నా దేశద్రోహం ఏముంటుంది?. అటువంటి మోసగాడికి శిక్ష వేయాల్సిందే. సుభాష్ చంద్ర బోస్ లో సినిమాలో వెంకటేష్ అదేచేసాడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆనాటి పోరాటాన్ని, అప్పటి ప్రజల్లో ఉన్న దేశభక్తిని కళ్లకు కట్టింది.

మనోహరంజగపతి బాబు చేసిన దేశభక్తి చిత్రం మనోహరం. ఈ చిత్రంలో ఒక బ్యాంక్ ఉద్యోగి, అతని భార్య, పోలీసులు, టెర్రరిస్టులు మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా అమోఘంగా ఉంటుంది. గుణశేఖర్ దేశభక్తిని కొత్తకోణంలో ఆవిష్కరించి విజయం సాధించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus