The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’
- July 21, 2026 / 03:12 PM ISTByPhani Kumar
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన నుండి ఓ సినిమా వస్తుంది అంటే వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని నమ్మే వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఎక్కువ. ఆయన దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ వార్ డ్రామా ‘ది ఒడిస్సీ'(The Odyssey). మాట్ డామన్, టామ్ హాలెండ్, అన్నే హాథ్‌వే, రాబర్ట్ ప్యాటిన్సన్ వంటి వారు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
The Odyssey

ఆ భారీ అంచనాల నడుమ జూలై 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది ‘ఒడిస్సీ’ చిత్రం. మొదటి రోజే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. గ్రీకు పురాతన గాథను నేటి జెన్‌జీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా అన్ని రకాల ఎమోషన్స్ తో కమర్షియల్ హంగులతో ‘ది ఒడిస్సీ’ చిత్రాన్ని రూపొందించాడు క్రిస్టోఫర్ నోలన్. లవ్, అడ్వెంచర్ అంశాలు అందరినీ అమితంగా ఆకట్టుకున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఊచ కోత మొదలుపెట్టింది ‘ఒడిస్సీ’.
మొదటి వీకెండ్ ముగిసేసరికి ఏకంగా రూ.2385 కోట్లు కొల్లగొట్టింది. వీటిలో ఇండియా నెట్ రూ.55 కోట్ల వరకు ఉండటం విశేషం. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. అందుతున్న సమాచారం మేరకు.. ఒక్క తెలుగు నుండే దాదాపు రూ.16 కోట్ల గ్రాస్ వసూలైనట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయమనే చెప్పాలి.
టాలీవుడ్ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ













