The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?
- September 22, 2026 / 10:28 AM ISTByPhani Kumar
[Click Here For Detailed Full Review]
నేచురల్ స్టార్ నాని కెరీర్లో భారీ బడ్జెట్ తో రూపొందిన పాన్ ఇండియా సినిమా ‘ది ప్యారడైజ్'(The Paradise). కయాడు లోహర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. గతంలో ఇతను నానితో చేసిన ‘దసరా’ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. నాని కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. హిట్టు కాంబినేషన్ కావడంతో మొదటి నుండీ ‘ది ప్యారడైజ్’ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘ఆయా షేర్’ సాంగ్ కావచ్చు ‘ఏష నాగుల’ సాంగ్ కావచ్చు ‘ప్యారడైజ్’ కి బోలెడంత మైలేజ్ ను తీసుకొచ్చాయి.
The Paradise

దీంతో ట్రైలర్ అవసరం లేకుండానే ‘ది ప్యారడైజ్’ని థియేటర్లలోకి దింపుతున్నారు మేకర్స్. ఓవర్సీస్ లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే హాఫ్ మిలియన్ కి పైగా కలెక్ట్ చేసి 1 మిలియన్ దిశగా దూసుకుపోతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు వేస్తున్నారు, టికెట్ రేట్లు కూడా పెంచారు. అయినప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మొదటి రోజు నాని కెరీర్లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
[Click Here For Detailed Full Review]
మరోవైపు ఈ చిత్రాన్ని కొంతమంది సన్నిహితులకి, ఇండస్ట్రిలో ఉన్న పెద్దలకి చూపించారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. సినిమా చూసిన అనంతరం తమ అభిప్రాయాన్ని వారు షేర్ చేసుకోవడం జరిగింది. ఈ కథ 1985 బ్యాక్ డ్రాప్లో జరుగుతుందట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో కథ మొదలవుతుంది అంటున్నారు. మోహన్ బాబు పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. ఇక నాని ఇంట్రడక్షన్ ఓ బిర్యానీ ఫైట్ తో అవుతుంది అంటున్నారు.
నాని లుక్, డైలాగ్ డెలివరీ, డాన్స్ ఇలా అన్నిటిలో తన బెస్ట్ ఇచ్చాడు అంటున్నారు. కయాడు లోహర్ పాత్ర బోల్డ్ గా ఉంటుందట. ఇంటర్వల్ బ్లాక్ అలాగే 2 యాక్షన్ సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్లో పిక్చరైజ్ చేశారట. మధర్ సెంటిమెంట్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుందని..! సాంగ్స్ అన్నీ విజువల్ గా చాలా బాగున్నాయని అంటున్నారు. అలాగే తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ‘ది ప్యారడైజ్’ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు అనిరుథ్ అని అంటున్నారు. చూడాలి మరి ప్రీమియర్ షోలకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో..!
[Click Here For Detailed Full Review]
30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

















