ప్రశంసలు, అవార్డులు అందుకున్న ఫీచర్ ఫిల్మ్ ‘దహనం’ పోస్టర్ విడుదల
- August 23, 2022 / 12:12 PM ISTByFilmy Focus
ఎన్నో అవార్డులు అందుకున్న ఫీచర్ ఫిల్మ్ ‘దహనం’కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆదిత్య ఓం ఓ ఓల్డ్ గెటప్‌లో ఇది వరకు ఎన్నడూ కనిపించని విధంగా కనిపిస్తున్నారు. పురాతన ఆలయాన్ని పరిరక్షించే రక్షకుడిగా కనిపిస్తున్నారు. అదారి మూర్తి సాయి తెరకెక్కించిన ఈ చిత్రం ఇది వరకే ఎన్నో జాతీయ వేదికల మీద ఎంతో మంది ప్రశంసలతో పాటు అవార్డులు కూడా అందుకుంది. రెండు బెస్ట్ యాక్టర్ అవార్డులు కూడా వచ్చాయి. నిర్మాతగానే కాకుండా సంగీత దర్శకుడిగానూ డా. పి సతీష్ కుమార్‌కు మంచి ప్రశంసలు వచ్చాయి. శాంతి చంద్ర, ఎఫ్‌ఎం బాబాయ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఎంతో ఆర్టిస్టిక్‌గా ఉన్నా కూడా అంతర్లీనంగా కులాలు, మతాల మీద ప్రశ్నించినట్టుగా ఉంటుంది. అదే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆలోచించేలా చేస్తుంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













