ప్రభాస్ (Prabhas) – మారుతి (Maruthi Dasari) కాంబినేషన్లో ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్లో ‘ది రాజాసాబ్’ (The Raja saab) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది ఒక హారర్ రొమాంటిక్ కామెడీ సినిమా. ప్రభాస్ ఇలాంటి జోనర్లో సినిమా చేయడం ఇదే మొదటిసారి. అయితే దీనికి వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ టైం పడుతున్నట్టు ఇన్సైడ్ టాక్. అందుకే ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి షూటింగ్ డిసెంబర్ చివర్లోనే కంప్లీట్ అయిపోయింది.
దీంతో ఏప్రిల్ 10న రిలీజ్ ఖాయం అని అంతా అనుకున్నారు.మరోపక్క మారుతి కొంత ప్యాచ్ వర్క్ ను కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేస్తూ వచ్చాడు. కానీ ఇప్పటికీ వీఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ అవ్వలేదట. దీంతో ఈ సినిమా మరింత ఆలస్యం అవుతుంది.. ఏప్రిల్ 10కి వచ్చే అవకాశం లేదు అని టాక్ వినిపిస్తోంది.
మరోపక్క ఏప్రిల్ 10న ‘ది రాజాసాబ్’ కనుక రాకపోతే.. ‘విశ్వంభర’ ని (Vishwambhara) విడుదల చేయాలని నిర్మాతలైన ‘యూవీ క్రియేషన్స్’ వారు భావించారు. ఇందుకోసం పీపుల్ మీడియా వారితో వారు చర్చలు జరపడం కూడా జరిగింది. అందుకు వాళ్ళు కూడా సరే అనడంతో ఏప్రిల్ 10న ‘విశ్వంభర’ వస్తుంది అంటున్నారు.
ఒకవేళ డిలే అయితే మే 9న రావడం ఖాయం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ‘విశ్వంభర’ వీఎఫ్ఎక్స్ వర్క్ అనుకున్నట్టు రాలేదట. పైగా ఓటీటీ డీల్ కూడా ఫినిష్ కాలేదు. అందువల్ల సమ్మర్ కి ‘విశ్వంభర’ కూడా వచ్చే అవకాశాలు లేనట్లే కనిపిస్తుంది.