సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో దగ్గుబాటి రానా హీరోగా నటించిన ‘ఘాజీ’ సినిమా ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. గత శుక్రవారం (ఫిబ్రవరి 17 ) తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అయిన విడుదలైన ఈ మూవీ అందరీ అభినందనలు అందుకుంటోంది. దీంతో ఘాజీ అనే అంటే ఏంటి? దాని చరిత్ర తెలుసుకోవాలని అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే ఫిల్మీ ఫోకస్ అలనాటి సంగతులను సేకరించి మీకు అందిస్తోంది.
ఘాజీ అనేది పాకిస్థాన్ సబ్ మెరియన్. ఆ దేశస్థులు భారత్ కి ఉన్న అతిపెద్ద యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ని పేల్చివేయాలని ఘాజీని అమెరికా నుంచి కొనుగోలు చేశారు. ఆ నౌక ను శత్రు దేశస్థులు కరాచీ నుంచి వైజాక్ కి పంపించారు. ఘాజీ బంగాళాఖాతంలోకి ప్రవేశించడాన్ని తెలుసుకున్న భారత నౌకాదళ కెప్టెన్ విక్రాంత్ ని అండమాన్ కి తరలించారు. విక్రాంత్ ప్లేస్ లో ఐఎన్ఎస్ రాజ్ ఫుట్ నౌకను రంగంలోకి దించారు. 90 మంది సైనికులు ఘాజీలో ఉండి వైజాక్ తీరంలో విక్రాంత్ కోసం గాలించారు. అది కనిపించక పోయేసరికి నీటిలో మైన్స్ ని పెట్టసాగారు. దీంతో మన సైనికులు ఐఎన్ఎస్ రాజ్ ఫుట్ నౌక నుంచి ఘాజిపై బాంబు పేల్చారు. దాన్ని నుంచి తప్పించుకుందామని అడుగుభాగంలోకి ఘాజీని తీసుకెళ్తుండగా మైన్స్ తగిలి పేలిపోయింది. పాకిస్తానీయులు వేసిన గోతిలోనే వాళ్లే పడ్డారు. విక్రాంత్ కోసం పెట్టిన మైన్స్ వల్ల ఘాజీని కోల్పోయారు. ఇదంతా 1971 వ సంవత్సరంలో జరిగింది. 46 ఏళ్ళ క్రితం జరిగిన ఈ సంఘటనను ఘాజీ చిత్ర యూనిట్ వెండితెరపై చూపించే ప్రయత్నం చేసింది. విజయాన్ని అందుకుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.