బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘దురంధర్’ సినిమాలో షరారత్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా పాపులరైంది హాట్ బ్యూటీ ఆయేషా ఖాన్ (Ayesha Khan). అయితే ఈరోజు ముంబై పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. బుధవారం సాయంత్రం ముంబైలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో స్టూడెంట్స్ చేస్తున్న ఆందోళనల వద్ద ఉన్న ఆమెను.. పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కొంతసేపటికి తనను ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదంటూ ఆయేషా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పెట్టింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “నా చేతులు వణుకుతున్నాయి. నేను కనీసం ఒక్క నినాదం కూడా చేయలేదు, నిరసన కూడా మొదలుపెట్టలేదు.
నా సోదరుడిని, మగ స్నేహితులను అప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నేను, మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి ఎలాంటి నిరసన చేయకుండా రోడ్డు పక్కనే నిలబడి ఉన్నాను. అప్పుడే సుమారు 15 మంది మహిళా పోలీసులు వచ్చి మమ్మల్ని బలవంతంగా నెట్టుకుంటూ వ్యాన్‌లోకి ఎక్కించారు. కారణం ఏంటని అడిగితే కనీసం సమాధానం కూడా ఇవ్వలేదు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
స్టూడెంట్స్ హక్కుల కోసం CJP పార్టీ చేస్తున్న ఈ ఆందోళనలు ఢిల్లీ నుంచి ముంబైకి కూడా వ్యాపించాయి. ఈ ఆందోళనల్లో ఆయేషా ఖాన్ (Ayesha Khan) కూడా పాల్గొందనే అనుమానంతోనే ఆమెను అదుపులోకి తీసుకుని వర్లీ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్, నసీరుద్దీన్ షా లాంటి ఎంతోమంది బాలీవుడ్ సీనియర్ సెలబ్రిటీలు సైతం ఈ ఆందోళనలకు మద్దతుగా నిలుస్తుండటం గమనార్హం.