Prashanth Neel, Jr NTR: తారక్ ప్రశాంత్ నీల్ మీటింగ్ వెనుక అసలు రీజన్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అటు తారక్ ఇటు ప్రశాంత్ నీల్ కెరీర్ పరంగా బిజీగా ఉండగా వేర్వేరు కారణాల వల్ల ఈ కాంబినేషన్ సినిమా ఆలస్యమవుతోంది. తారక్ డేట్స్ గురించి ప్రశాంత్ నీల్ కు క్లారిటీ ఇచ్చేశారని సమాచారం అందుతోంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా షూట్ మొదలయ్యే ఛాన్స్ ఉంది.

తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ యాక్షన్ తో పాటు ఎమోషన్స్ తో ఉండనుందని తెలుస్తోంది. సలార్2 మూవీ పూర్తైన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. మైత్రీ నిర్మాతలు ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో నిర్మించనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు బడ్జెట్ విషయంలో లిమిట్స్ లేవని భారీ రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ ప్రతి సినిమాను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటుండగా తారక్ ప్రశాంత్ కాంబో మూవీ పాన్ వరల్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ప్రశాంత్ నీల్ ఈ సినిమా కాన్సెప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

తారక్ ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని ఆసక్తికర అప్ డేట్స్ అయితే రానున్నాయని సమాచారం అందుతోంది. సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలలో హీరోయిన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండదు. ప్రశాంత్ నీల్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో సత్తా చాటుతుండగా సినిమా సినిమాకు ఈ దర్శకుని రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ కు (Jr NTR) జోడీగా బాలీవుడ్ బ్యూటీ నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus