చరణ్, ఉపాసన లు అందుకే పిల్లలను వద్దనుకుంటున్నారట..!

సినిమా వాళ్ళు పెళ్లిళ్ళు లేట్ గా చేసుకుంటూ ఉంటారు. ఫేడౌట్ అయిపోయిన హీరోలు, హీరోయిన్ లు అయితే తప్ప.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా తొందరగా పెళ్లిళ్లు చేసుకోరు. అయితే మన మెగా పవర్ స్టార్ రాంచరణ్ మాత్రం.. మంచి వయసుకే పెళ్లి చేసుకున్నాడు. 35 ఏళ్ల వయసున్న రాంచరణ్ కు 8 ఏళ్ల క్రితమే ఉపాసనతో పెళ్లయ్యింది. వీరిద్దరూ టాలీవుడ్ ఆదర్శ దంపతులలో ఒకరుగా ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. అయితే ‘8 ఏళ్లయినా ఇంకా ఎందుకు వీరికి పిల్లలు లేరు’ అని చాలా మంది డిస్కస్ చేసుకుంటూ ఉంటారు .

అయితే దానికి గల కారణాన్ని ఉపాసన అలాగే రాంచరణ్ చెప్పకనే చెప్పారు. ఉపాసన మాట్లాడుతూ.. “పిల్లలు, ప్రెగ్నెన్సీ అనేది పూర్తిగా మా పర్సనల్ విషయం. మాకు ఇప్పట్లో కావాలి అనే ఆలోచన లేదు. అలాగే నాకు ప్రెగ్నెన్సీ అంటే కొంత భయం కూడా ఉంది. ఇప్పుడిప్పుడే నేను లావు తగ్గుతూ వస్తున్నాను. చరణ్ కు నాకు ఓ ప్లాన్ ఉంది. పిల్లల్ని ఎప్పుడు కనాలనే విషయంలో మాకు ఓ క్లారిటీ ఉంది” అని ఉపాసన ఎప్పుడో చెప్పింది. ఇక చరణ్ కూడా.. “మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా నేను అభిమానుల్ని సంతృప్తి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అప్పుడే కంప్లీట్ ఫ్యామిలీ మెన్ గా మారితే నేను డీవియేట్ అవ్వొచ్చు. అంతేకాక ఉపాసనకు కూడా కొన్ని గోల్స్ ఉన్నాయి.

అందుకే కొన్నాళ్ల పాటు మేము పిల్లల్ని లైట్ తీసుకోవాలి అని భావిస్తున్నాం” అంటూ చరణ్ కూడా క్లారిటీ ఇచ్చాడు. ఇక రాంచరణ్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తున్నాడు..! లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ చిత్రం షూటింగ్.. ఈరోజు నుండీ తిరిగి ప్రారంభం కానుందని సమాచారం. ఇక ఈ చిత్రం పూర్తైన తరువాత తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో కూడ చరణ్ నటించబోతున్నాడు.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus