నాని రెమ్యునరేషన్ పెంచడం వెనుక ఉన్న మెయిన్ రీజన్..!

‘నానీస్ గ్యాంగ్ లీడర్’ ‘వి’ వంటి చిత్రాలతో ప్లాపులు మూటకట్టుకున్న నాని.. ఇప్పుడు ఎలాగైనా హిట్టు కొట్టాలని శివ నిర్వాణ డైరెక్షన్లో ‘టక్ జగదీష్’, రాహుల్ సంక్రిత్యన్ డైరెక్షన్లో ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి చిత్రాలు చేస్తున్నాడు. ఇవి రెండు డిఫరెంట్ జోనర్ మూవీస్ కాబట్టి మంచి హైప్ ఏర్పడింది. అందుకే వీటితో ఎలాగైనా హిట్లు కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని నాని ట్రై చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. నాని ప్రస్తుతం తన పారితోషికాన్ని పెంచేసినట్టు తాజా సమాచారం.

కరోనా కారణంగా నిర్మాతలకు చాలా నష్టాలు వాటిల్లాయి. ఇలాంటి టైములో హీరోలు పారితోషికాలు తగ్గించుకుని వాళ్లకు అండగా నిలబడతారు అని అంతా అనుకుంటే… రివర్స్ లో నాని ఇలా చెయ్యడం పై పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పటివరకూ నాని ఒక్కో సినిమాకి రూ.10.5 నుంచి రూ.11 కోట్లు వరకూ పారితోషికం అందుకుంటున్నాడట. కానీ ఇప్పుడు ఏకంగా రూ.14 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని ఇన్సైడ్ టాక్. నాని సినిమాలకు నాన్ థియేట్రికల్స్ రూపంలో..

అంటే హిందీ డబ్బింగ్, డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా ఎక్కువ వసూళ్లు వస్తుంటాయట. అందుకే నాని తన పారితోషికాన్ని పెంచినట్టు వార్తలు వస్తున్నాయి. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారితో చెయ్యబోతున్న ‘అంటే సుందరానికి’ చిత్రం నుండీ నాని ఇంత పెద్ద మొత్తం అందుకోబోతున్నట్టు సమాచారం. వివేక్ ఆత్రేయ తెరకెక్కించనున్న ఈ చిత్రం ద్వారా మలయాళం స్టార్ హీరోయిన్ నజ్రియా స్ట్రైట్ తెలుగు మూవీ చేయబోతుంది.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus