సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి గ్లోబల్ స్టార్ ప్రాయంగా చోప్రా తన భర్త నిక్ జోనాస్ ఇంటి పేరుని తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. ప్రియాంక చోప్రా జోనాస్ అని ఉండే తన ప్రొఫైల్ నేమ్ లో ప్రియాంక అని మాత్రమే ఉంది జోనాస్ పేరుని తీసేసింది. ఇలాంటి సంఘటనే నాగచైతన్య-సమంత విషయంలో జరగడంతో ప్రియాంక కూడా విడాకులు తీసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయంలో నిజం లేదని ప్రియాంక తల్లి చెప్పినా.. వార్తలకు ఫుల్ స్టాప్ పడలేదు.
రీసెంట్ గా ప్రియాంక ఓ వీడియో షేర్ చేయడంతో పాటు భర్త షేర్ చేసిన వీడియోపై కామెంట్స్ చేయడంతో ఈ రూమర్లకు ఫుల్ స్టాప్ పడింది. అయితే ప్రియాంక మాత్రం తన పేరు పక్కన జోనాస్ ని ఎందుకు తొలగించిందనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో దీనికి కారణం ఇదేనంటూ కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా మంది జ్యోతిష్య శాస్త్రాన్ని, న్యూమరాలజీని బాగా నమ్ముతున్నారు. ప్రియాంకకు కూడా ఆ సెంటిమెంట్ ఉందని తెలుస్తోంది.
న్యూమరాలజీ ప్రకారం తన పేరు పక్కన జోనాస్ అనే పదం కలిసి రాదని, వాటిని తీసేస్తే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ప్రకారం లైఫ్ బాగుంటుందని చెప్పడంతో ప్రియాంక ఆ డెసిషన్ తీసుకుందట. మరికొందరేమో.. ఓ ఛాలెంజ్ లో భాగంగా ప్రియాంక ఇలా చేసిందని అంటున్నారు. అసలు కారణమేంటో ప్రియాంక చెప్పేవరకు ఎదురుచూడాల్సిందే!
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?