Rashmika: విక్రమ్‌ని కాదనుకుని ధనుష్‌ సినిమా ఓకే చేసిందా?

టాలీవుడ్‌ హీరోయిన్ల డైరీలు ఓసారి ఓపెన్‌ చేసి చూస్తే.. అత్యంత బిజీగా కనిపించే డైరీ రష్మిక మందనదే కావొచ్చు. తెలుగు, తమిళం, హిందీ అంటూ వరుస సినిమాలు చేస్తోంది. మధ్యలో గ్యాప్‌ ఉంటే ఆత్మ మిత్రుడితో కలసి మాల్దీవులు టూర్‌ వేస్తోంది. ఆ విషయం పక్కన పెడితే తన డైరీలో డేట్లు అడ్జెస్ట్‌ చేయలేక ఓ సినిమాను వదులుకుంది అని అంటున్నారు సినిమా జనాలు. అలా వదులుకున్న సినిమా చిన్నదేం కాదు.. విక్రమ్‌ సినిమా. దీంతో ఎందుకు అని చర్చ జరుగుతోంది.

పా రంజిత్‌ దర్శకత్వంలో విక్రమ్‌ తన 61వ సినిమా చేయాల్సి ఉంది. ఇటీవల ఈ సినిమాను అనౌన్స్‌ చేశారు. అందులో కథానాయికగా రష్మిక మందనను తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను నుండి ఆమె తప్పుకుంది అని చెబుతున్నారు. అంతేకాదు ఆమె స్థానంలో మరో నాయికను కూడా తీసుకున్నారని టాక్‌ వినిపిస్తోంది. రష్మిక బదులు మాళవిక మోహనన్‌ను ఈ సినిమాలో కథానాయికగా ఎంచుకున్నారని వార్తలొస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ సోమవారం నుండి కడపలో మొదలైంది.

పాన్‌ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఇక్కడే మరో విషయం తెలుస్తోంది. శేఖర్‌ కమ్ముల – ధనుష్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో కథానాయికగా రష్మికను ఎంపిక చేశారు అని వార్తలొస్తున్నాయి. విద్యావ్యవస్థ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. నిజానికి శేఖర్‌ కమ్ముల సినిమాలో హీరోయిన్ల, లేడీ క్యారెక్టర్ల పాత్రలు ఎప్పుడూ బలంగానే ఉంటాయి.

ఈ రెండు అంశాలు కలిపి చూస్తుంటే.. ధనుష్‌ సినిమా కోసం విక్రమ్‌ సినిమాను రష్మిక వదులుకుందా అనే డౌటానుమానం కలగక మానదు. దీనిపై ఆమెనే క్లారిటీ ఇవ్వాలి. పా రంజిత్‌ సినిమాలో హీరోయిన్ల పాత్రలు కూడా బలంగానే ఉంటాయి. అయితే గ్లామరస్‌గా కనిపించరు. మరి ఏ కారణంతో విక్రమ్‌ను కాదనుకుని ధనుష్‌ సినిమాను రష్మిక ఓకే అంది అనేది తెలియాలి. లేదంటే వేరే ఏమన్నా కారణాలున్నాయా అనేది తెలియాలి.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus