Ashika Ranganath: రెండు పాత్రలూ ఆఫర్‌ చేశారు.. ‘నైఫ్‌’ ఎందుకు ఎంచుకున్నానంటే: ఆషికా

రీసెంట్‌గా వస్తున్న రవితేజ సినిమాలకు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాకు చాలా డిఫరెన్స్‌ ఉంది. ఆ సినిమాల్లో రవి తనదైన మాస్‌, యాక్షన్‌ రోల్స్‌లో కనిపించాడు. అలాంటి కథలు, పాత్రలు ఆయనకు కేక్‌వాక్‌. కానీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనేది డిఫరెంట్‌ కాన్సెప్ట్‌. డిఫరెంట్‌ రోల్‌. సినిమా ట్రైలర్‌లో చెప్పినట్లు ఆయన డాక్టరే చెప్పాడో లేక ఫ్యామిలీ వెల్‌విషర్‌ చెప్పారో కానీ ఇలాంటి ఇద్దరు అమ్మాయిల మధ్య ఇరుక్కున్న ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపించబోతున్నాడు. ఓవైపు వైఫ్, మరోవైపు నైఫ్‌తో నలిగిపోతాడీ సినిమాలో. ఇందులో వైఫ్‌గా డింపుల్‌ హయాతీ నటించగా.. నైఫ్‌గా ఆషికా రంగనాథ్‌ కనిపించబోతోంది.

Ashika Ranganath

ఈ సినిమా గురించి డింపుల్‌, ఆషికా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఆషికాకు కథ చెప్పాక రెండు పాత్రలలో ఏది ఎంచుకుంటారు అని దర్శకుడు కిషోర్‌ తిరుమల అడిగారట. ఇప్పటికే ‘నా సామిరంగ’లో పల్లెటూరి అమ్మాయిగా సంప్రదాయ పాత్రలో కనిపించడంతో బోల్డ్‌గా కనిపించే రవితేజ ప్రియురాలు పాత్ర చేస్తానని ఆషికా చెప్పిందట. మానస శెట్టి అనే ఓ పెద్ద స్పిరిట్‌ ఎండీ కూతురిగా స్ట్రాంగ్, బోల్డ్‌ గర్ల్‌గా ఆ పాత్ర ఉంటుంది అని చెప్పిందామె.

ఇక డింపుల్‌కి కూడా ఇలాంటి ఆప్షనే ఎదురవ్వగా.. కథలో రెండూ బలమైన పాత్రలని, ఆషిక పోషించిన పాత్రను గతంలో చేసేయడంతో భార్య బాలామణి పాత్ర ఎంచుకున్నా అని డింపుల్‌ హయాతీ చెప్పింది. ఓ సినిమాలో ఇద్దరమ్మాయిలు ఉన్నారంటే హీరోకి వాళ్లకు మధ్య ముక్కోణపు ప్రేమకథ ఉంటుందని, ఒకరినొకరు కొట్టేసుకుంటుంటారు అనుకుంటారఉ. కానీ ఈ సినిమా అలా ఉండదు అని చెప్పింది డింపుల్‌.

క్లైమాక్స్‌ కొత్తగా అనిపిస్తుందని చెబుతోంది. అలాగే ఓ సర్‌ప్రైజ్‌ కూడా ఉంటుంది అని అంటోంది. అదేంటో చూడాలి మరి. ఇక ఈ సినిమాను జనవరి 13న విడుదల చేయబోతున్నారు. తొలుత సరైన థియేటర్లు దొరుకుతాయా అని చూడగా.. ఇప్పుడు ‘ప్రభాస్‌ రాజాసాబ్‌’ ఫలితం చూశాక బాగా థియేటర్లు దొరుకుతాయి అని తేలిపోయింది.

2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘ది రాజాసాబ్’

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus