Sonu Sood: సోనూసూద్ బాధకు అసలు కారణమిదే..?

  • May 27, 2021 / 07:39 PM IST

రియల్ హీరో సోనూసూద్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుపరిచితమైన నటుడైనప్పటికీ కెరీర్ తొలినాళ్లలో గుర్తింపును సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు సోనూసూద్ కొన్ని టీవీ షోలు చేశారు. కెరీర్ తొలినాళ్లలో సోనూసూద్ ఒక కామిక్ షో కోసం నాగ్ రాజ్ పాత్ర కూడా వేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూకు సోనూసూద్ హాజరు కాగా ఆ పాత్రకు సంబంధించిన ప్రశ్నలు సోనూసూద్ కు ఎదురయ్యాయి. సోనూసూద్ ప్రస్తుతం ఏ విధంగా ప్రజల కష్టాలను తెలుసుకొని సహాయం చేస్తున్నారో నాగ్ రాజ్ పాత్రలో కూడా అదే విధంగా కష్టాలు తీర్చారు.

నాగ్ రాజ్ పాత్రలో గాలిలో ఎగురుతూ ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి నోటి ద్వారా మంటను వదులుతూ సోనూసూద్ కనిపించారు. ఆ పాత్ర గురించి సోనూసూద్ చెబుతూ తన కెరీర్ లో దొరికిన తొలి పాత్ర నాగ్ రాజ్ పాత్ర అని అన్నారు. ఆ పాత్రలో చూసుకోవడం తనకు ఇబ్బందిగా అనిపించేదని సోనూసూద్ తెలిపారు. ఒకసారి తాను మార్కెట్ కు వెళ్లిన సమయంలో తన ఫోటోతో ఉన్న కామిక్ షోకు సంబంధించిన బుక్ కనిపించిందని తన మరదలు ఆ పుస్తకం కొనమని చెప్పినా తాను కొనలేదని సోనూసూద్ అన్నారు.

ఇప్పుడు మాత్రం ఆ జ్ఞాపకం తన దగ్గర లేదని బాధ పడుతున్నానని సోనూసూద్ పేర్కొన్నారు. ఆ పాత్ర ద్వారా తనకు ఢిల్లీలో కూడా గుర్తింపు వచ్చిందని  సోనూసూద్ చెప్పుకొచ్చారు. ఈ రియల్ హీరో తెలుగులో ప్రస్తుతం ఆచార్య సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో నటిస్తున్నారు.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus