మెగాస్టార్ చిరంజీవికి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతోమంది నటీనటులు చిరంజీవి తమకు స్పూర్తి అని చెబుతారు. చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేందుకు ఎంతో కష్టపడుతున్నారు. వయస్సు పెరుగుతున్నా మెగాస్టార్ చిరంజీవి ఎనర్జీ లెవెల్స్ మాత్రం అస్సలు తగ్గలేదు. చిరంజీవి కొన్ని బాలీవుడ్ సినిమాలలో సైతం నటించగా ఆ సినిమాలలో కొన్ని సినిమాలు సక్సెస్ సాధించాయి.
బాలీవుడ్ సినిమాలలో నటించే సమయానికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. అయితే బాలీవుడ్ సినిమాలలో తర్వాత కాలంలో చిరంజీవి ఎందుకు కెరీర్ ను కొనసాగించలేదని చాలామందిలో సందేహం ఉంది. బాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా నటించకపోవడం గురించి చిరంజీవి మాట్లాడుతూ అప్పటి స్టార్ డైరెక్టర్లు మనోహన్ దేశాయ్, ప్రకాశ్ మెహ్రా, సజిత్ నదియావాలా నాకు చాలా కథలు వినిపించారని అయితే ఆ కథలు ఆకట్టుకోలేదని చిరంజీవి (Chiranjeevi) చెప్పుకొచ్చారు.
కథ బాగుంటే ఆ సినిమాలలో కచ్చితంగా నటించేవాడినని ఆయన కామెంట్లు చేశారు. సినిమాకు కథే బలమని నాకు నచ్చిన కథలు వచ్చి ఉంటే చేసేవాడినని ఆయన అన్నారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాపై దృష్టి పెట్టారు. సోషియో ఫాంటసీ మూవీగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. సీనియర్ హీరోలలో ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్న ఏకైక మూవీ చిరంజీవి విశ్వంభర కావడం గమనార్హం.
యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో, క్వాలిటీ విజువల్ గ్రాఫిక్స్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలుస్తోంది. చిరంజీవి కథ, కథనం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని 2025లో విడుదల కానున్న విశ్వంభర ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆయన నమ్ముతున్నారని తెలుస్తోంది.
ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!
కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!