టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన వర్మ ఈ మధ్య కాలంలో తెరకెక్కించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించలేదు. దర్శకుడిగా వర్మ క్రేజ్ తగ్గిందనే సంగతి తెలిసిందే. తాజాగా వర్మ జగన్ తో భేటీ అయ్యారు. రాజకీయ నేపథ్యంలో ఒక సినిమా తెరకెక్కించాలని జగన్ వర్మను కోరారని వర్మ అందుకు అంగీకరించారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. చంద్రబాబు, పవన్ వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.
టీడీపీ, జనసేనలపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా సినిమాను తెరకెక్కించాలని జగన్ వర్మను కోరారని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. దర్శకునిగా వర్మ కెరీర్ ముగిసిందని అందరూ భావిస్తున్న తరుణంలో వర్మ మాత్రం ఏదో ఒక విధంగా కొత్త సినిమా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. ఫ్లాప్ సినిమాల దర్శకుడిని వైసీపీ నమ్ముకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే వర్మ సినిమాలకు పబ్లిసిటీ బాగా జరుగుతుందని సినిమాకు మార్నింగ్ షోకు మాత్రమే కలెక్షన్లు వస్తాయని చాలామంది భావిస్తున్నారు. వర్మ సినిమాలను విడుదల చేయడానికి థియేటర్ల ఓనర్లు సైతం ఇష్టపడరనే సంగతి తెలిసిందే. వర్మ ప్రకటించే టైటిల్, ట్రైలర్ లోని షాట్స్ మాత్రమే బాగుంటాయని సినిమా ఆకట్టుకునేలా ఉండదని అందరికీ తెలుసు. ఈ సినిమాకు వైసీపీ నేతలే నిర్మాతలుగా వ్యవహరించే ఛాన్స్ అయితే ఉంది.
వర్మ చేతిలో ప్రస్తుతం మూడు సినిమా ఆఫర్లు ఉన్నాయని బోగట్టా. ఈ సినిమాతో పాటు కేంద్రంలో అధికారంలో లేని ఒక జాతీయ పార్టీ కోసం కూడా ఒక సినిమాను వర్మ తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. రాజకీయ నేతలు సినిమాలను నిర్మిస్తుండటంతో సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకున్నా వర్మ రెమ్యునరేషన్ అతనికి వచ్చేస్తుంది. వర్మ కొత్త ప్రాజెక్ట్ లను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాల్సి ఉంది. 2024 ఎన్నికలకు ముందే ఈ ప్రాజెక్ట్ లు రిలీజ్ కానున్నాయి.
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!