Hero Tarun: తరుణ్ మళ్లీ సినిమాలతో బిజీ అవుతారా?

బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరుణ్ హీరోగా తొలి సినిమా నువ్వే కావాలి ఘన విజయం సాధించడంతో ఇండస్ట్రీలో కెరీర్ ను మొదలుపెట్టారు. ఆ తరువాత తరుణ్ నటించిన నువ్వేనువ్వే, ప్రియమైన నీకు, నువ్వులేక నేను లేను సినిమాలు ఘనవిజయం సాధించాయి. స్టార్ హీరోగా తరుణ్ గుర్తింపును సొంతం చేసుకుంటాడని ప్రేక్షకులు భావించిన సమయంలో వరుస ఫ్లాపులు తరుణ్ కెరీర్ కు మైనస్ అయ్యాయి. తరుణ్ నటించిన సోగ్గాడు, ఒక ఊరిలో, భలే దొంగలు, ఎలా చెప్పను సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

తరుణ్ నటించిన ఇది నా లవ్ స్టోరీ సినిమా మూడున్నరేళ్ల క్రితం విడుదలై డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంది. ఆ సినిమా తరువాత తరుణ్ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. తరుణ్ పూర్వ వైభవం సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాల ఎంపిక విషయంలో తప్పులు చేయకుండా ఉండి ఉంటే తరుణ్ ఇప్పటికీ వరుస ఆఫర్లతో బిజీగా ఉండేవారని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు డ్రగ్స్ కేసులో ఈ నెల 22వ తేదీన తరుణ్ విచారణకు హాజరవుతున్నారు.

సినిమాల విషయంలో తరుణ్ మనస్సులో ఏముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. తరుణ్ కు సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీ స్థాయిలో ఉండటం గమనార్హం. తరుణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తానంటే ఆఫర్లు ఇవ్వడానికి దర్శకనిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus