ప్రముఖ సినీ క్రిటిక్, దర్శకుడు, నటుడు కత్తి మహేష్ ప్రస్తుతం చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం కత్తి మహేష్ చికిత్స కోసం ఏకంగా 17 లక్షల రూపాయల సహాయం చేసింది. జగన్ సర్కార్ కత్తి మహేష్ కు సాయం చేయడానికి అసలు కారణం వేరే ఉంది. కత్తి మహేష్ కు వైసీపీ మద్దతుదారునిగా పేరు ఉండటంతో పాటు చాలా సందర్భాల్లో కత్తి మహేష్ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలను ప్రశంసించారు.
కొన్ని సందర్భాల్లో కత్తి మహేష్ జగన్ సర్కార్ పై విమర్శలు చేసినప్పటికీ కత్తి మహేష్ వైసీపీ చేస్తున్న తప్పులు ఆ పార్టీ నాయకులకు తెలిసేలా చేశారే తప్ప పార్టీ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వ్యవహరించలేదు. మహేష్ పట్ల వైసీపీ సానుకూలంగా వ్యవహరించలేదని ఈ మధ్య కాలంలో విమర్శలు వ్యక్తమయ్యాయి. జగన్ సర్కార్ స్పందించకపోయి ఉంటే ప్రతిపక్షాలు సైతం విమర్శలు చేసే అవకాశం ఉంది. ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు దళితులను ఏపీ ప్రభుత్వానికి దూరం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇలాంటి సమయంలో దళిత నేతకు సహాయం చేసి ప్రభుత్వం తెలివిగా వ్యవహరించింది. మరోవైపు కత్తి మహేష్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. కత్తి మహేష్ పై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా పవన్ అభిమానులు సైతం కత్తి మహేష్ త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని సాధారణ మనిషి కావాలని భావిస్తున్నారు. కత్తి మహేష్ ఎడమ కంటిచూపును కోల్పోయారని వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాదని తెలుస్తోంది.