టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటులలో మోహన్ బాబు ఒకరు కాగా మోహన్ బాబు శాకుంతలం సినిమాలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. మూడు వారాల తర్వాత ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని మోహన్ బాబు శాకుంతలం సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019 ఎన్నికల సమయంలో మోహన్ బాబు వైసీపీ తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
రాజకీయాలపై విరక్తి కలగడం గురించి మోహన్ బాబు స్పందిస్తూ ఆ ప్రశ్న ఇక్కడ అప్రస్తుతం అని అన్నారు. చాలా సంవత్సరాల క్రితం జరిగిన దానిని ఇప్పుడు గుర్తుచేసుకోవాల్సిన అవసరం అయితే లేదని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. 30 ఏళ్ల క్రితం టీడీపీలో ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం గురించి స్పందిస్తూ గతం గతః ప్రస్తుతం దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదని మోహన్ బాబు అన్నారు.
2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేయడం గురించి మోహన్ బాబు స్పందిస్తూ సీఎం జగన్ బంధువు కావడంతో ఆ పార్టీ తరపున ప్రచారం చేశానని అంతకు మించి వైసీపీ తరపున ప్రచారం చేయడం వెనుక మరే కారణం లేదని కామెంట్లు చేశారు. నేను పదవులు ఆశించి వైసీపీ తరపున ప్రచారం చేయలేదని మోహన్ బాబు వెల్లడించడం గమనార్హం.
మోహన్ బాబు రెమ్యునరేషన్ భారీ రేంజ్ లోనే ఉందని సమాచారం అందుతోంది. మోహన్ బాబు పరిమితంగా సినిమాలలో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మోహన్ బాబు వయస్సు ప్రస్తుతం 71 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. మోహన్ బాబు కొడుకులు విష్ణు, మనోజ్ లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. విష్ణు, మనోజ్ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్