నాగచైతన్యకు లాల్ సింగ్ చద్దా, థాంక్యూ సినిమాలతో భారీ షాకులు తగిలాయనే సంగతి తెలిసిందే. కస్టడీ సినిమాతో నాగచైతన్య హిట్ ట్రాక్ లోకి వస్తారని ఫ్యాన్స్ భావించగా ఈ సినిమా కూడా షాకిచ్చింది. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న నాగచైతన్య ఈ సినిమాలో మత్స్యకారుని పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో మరో భారీ సక్సెస్ ను అందుకుంటానని చైతన్య భావిస్తున్నారు. చందూ మొండేటి గత సినిమా కార్తికేయ2 బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.
ఈ డైరెక్టర్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. చందూ మొండేటి తర్వాత సినిమాతో నాగచైతన్యకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇస్తాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. చందూ మొండేటికి ప్రముఖ నిర్మాతల నుంచి భారీ రెమ్యునరేషన్ తో ఆఫర్లు వస్తుండటం గమనార్హం. మరోవైపు నాగచైతన్య 9 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ ను రిజెక్ట్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రముఖ సంస్థ స్పెషల్ రోల్ కోసం ఈ మొత్తం ఆఫర్ చేయగా నాగచైతన్య సున్నితంగా రిజెక్ట్ చేశారని సమాచారం.
రోజుకో కోటి రూపాయల చొప్పున పది రోజుల షూట్ కు ఈ మొత్తం ఆఫర్ చేయగా చైతన్య మాత్రం ఆ ఆఫర్ ను వదులుకున్నారని సమాచారం అందుతోంది. స్పెషల్ రోల్స్ లో నటించడం వల్ల భారీస్థాయిలో పారితోషికం దక్కినా సంతృప్తి ఉండదని భావించి చైతన్య ఈ ఆఫర్ ను వదులుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయంలో చైతన్య (Naga Chaitanya) గ్రేట్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగచైతన్యకు కెరీర్ పరంగా భారీ హిట్లు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాగచైతన్య కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. వరుసగా విజయాలు దక్కేలా చైతన్య కెరీర్ ను ప్లాన్ చేసుకోవాల్సి ఉంది.