Prabhas: బాహుబలి ప్రొడ్యూసర్లను ప్రభాస్ కలవడానికి రీజన్ ఇదేనా?

స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి1, బాహుబలి2 సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. బాహుబలి2 తర్వాత ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నా భారీ విజయాలు అయితే దక్కలేదు. సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో ప్రభాస్ మళ్లీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ రెండు సినిమాలలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది.

అయితే రాజమౌళి ప్రభాస్ (Prabhas) కాంబినేషన్ లో బాహుబలి3 కూడా తెరకెక్కనుందని గతంలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ప్రభాస్ బాహుబలి ప్రొడ్యూసర్లను కలవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. బాహుబలి3 సినిమా కోసమే ప్రభాస్ ప్రొడ్యూసర్లను కలిశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ప్రభాస్ గతంలో ఒక సందర్భంలో బాహుబలి పార్ట్3 గురించి నాకు తెలియదని అన్నారు.

సమయం వచ్చినప్పుడు ఏదైనా జరగొచ్చని ప్రభాస్ చెప్పుకొచ్చారు. బాహుబలి నిర్మాతలలో ఒకరైన ప్రసాద్ దేవినేని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి పార్ట్3 వచ్చే అవకాశం ఉందని కామెంట్లు చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందో మాత్రం చెప్పలేమని వెల్లడించారు. ప్రస్తుతం రాజమౌళి బిజీగా ఉన్నారని జక్కన్న ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత పార్ట్3 తెరకెక్కనుందని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం బాహుబలి3 మూవీకి సంబంధించిన ప్రయత్నాలు మొదలుపెట్టలేదని ఆయన తెలిపారు. ప్రభాస్ లేదా రాజమౌళి స్పందిస్తే మాత్రమే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.. బాహుబలి3 మూవీ 5000 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమా సినిమాకు ప్రభాస్ రేంజ్ పెరుగుతోంది. ప్రభాస్ కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రభాస్ పారితోషికం 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus