Ravi Teja Remuneration: రవితేజ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి కారణాలివే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రవితేజ ఈ మధ్య కాలంలో రెమ్యునరేషన్ కు సంబంధించిన విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. రవితేజ ప్రతి మూవీకి రెమ్యునరేషన్ ను పెంచుతున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. రవితేజ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం సిద్ధంగా ఉన్నారు. గతేడాది క్రాక్ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న రవితేజకు ఈ ఏడాది ఖిలాడీ సినిమాతో చేదు ఫలితం ఎదురైంది. ప్రస్తుతం రవితేజ ఐదు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా రాబోయే రెండేళ్లలో ఈ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.

అయితే రవితేజకు నాన్ థియేట్రికల్ మార్కెట్ ఎక్కువగా ఉండటం వల్లే నిర్మాతలు ఈ హీరోతో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. రవితేజ సినిమాలు హిందీలో డబ్ కావడంతో పాటు అక్కడ మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటున్నాయి. రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు, వాల్తేరు వీరయ్య సినిమాలలో రవితేజ నటిస్తున్నారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తే రవితేజ రేంజ్ మరింత పెరగడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

రవితేజ సినిమాలన్నీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లుగా తెరకెక్కుతుండటం గమనార్హం. కెరీర్ విషయంలో రవితేజ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కొత్త డైరెక్టర్లకు కూడా రవితేజ అవకాశాలను ఇస్తున్నారు. త్వరలో రవితేజ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటన వెలువడే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

రవితేజ ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నా స్టార్ హీరోయిన్లతోనే నటిస్తానని షరతులు విధించకపోవడంతో ఆ విధంగా నిర్మాతలకు బెనిఫిట్ కలుగుతోంది. రవితేజ నటిస్తున్న సినిమాలలో కొన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. రవితేజ కెరీర్ లో మరెన్నో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus