Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో భోలే ఎలిమినేషన్ కి అసలు కారణం ఏంటంటే.?

  • November 13, 2023 / 12:54 PM IST

బిగ్ బాస్ హౌస్ లో 10వ వారం భోలేషవాలి అనూహ్యంగా ఎలిమినేట్ అయిపోయాడు. నిజానికి అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో భోలే సెకండ్ ప్లేస్ లో కనిపిస్తున్నా కూడా హాట్ స్టార్ అఫీషియల్ ఓటింగ్ మాత్రం భోలే కి జరగలేదు. అందుకే, ఛలో అంటూ ఇంటికి పంపించేసింది బిగ్ బాస్ టీమ్. నిజానికి భోలే వచ్చిన వారం లోనే నామినేషన్స్ లోకి వస్తునే ఉన్నాడు. స్టార్ మా బ్యాచ్ ని టార్గెట్ చేసిన భోలే నామినేషన్స్ లో వాళ్లకి ఎదురు తిరిగాడు. కానీ, పాయింట్ మాత్రం మాట్లాడకుండా తన పాటలతో, హావభావాలతో కొత్తరకం స్టైల్ ని చూపించాడు.

ఇది కొంతమంది ఆడియన్స్ కి నచ్చలేదు. అలాగే, హౌస్ లో శోభా – ప్రియాంక – అమర్ ఈ ముగ్గురూ కూడా బాగా ఇరిటేట్ అయ్యారు. ఆ తర్వాత భోలేకి అశ్విని బాగా కనెక్ట్ అయ్యింది. ఇద్దరూ కష్టసుఖాలని పంచుకున్నారు. టాస్క్ లో పల్లవి ప్రశాంత్ ఓడిపోతే భోలే ఏడ్చాడు. అశ్విని ఓదార్చింది. ఇలా తన గేమ్ కి సంబంధం లేకపోయినా కూడా భోలే ఫీల్ అయ్యాడు. హౌస్ లోకి వెళ్లగానే శివాజీ గ్రూప్ లో జాయిన్ అయిపోయినట్లుగా సభ్యత్వం తీసేసుకున్నాడు.

అప్పట్నుంచీ భోలే స్టార్ మా బ్యాచ్ ని నామినేట్ చేస్తూ వచ్చాడు. ఈవారం కూడా అమర్ భోలేనే నామినేట్ చేశాడు. రాజమాతలు యాక్సెప్ట్ చేశారు. ఆడియన్స్ రిజక్ట్ చేసి ఎలిమినేట్ చేశారు. అయితే, భోలేని ఎందుకు ఎలిమినేట్ చేశారని ఇప్పుడు ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

భోలే ఎలిమినేషన్ అన్ ఫైయిర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు భోలే ఎలిమినేషన్ కి కారణాలు ఏంటా అని ఆరాలు తీస్తున్నారు. నిజానికి అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో రతికకి తక్కువ ఓటింగ్ జరిగింది. కానీ, ఫిమేల్ కేటగిరిలో రతికకి ఇంకో ఛాన్స్ ఇచ్చాడు (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్. మరి భోలే ఎలిమినేషన్ కి మనం కొన్ని కారణాలు చూసినట్లయితే.,

నెంబర్ -1

ఫస్ట్ నుంచీ భోలే శివాజీ గ్రూప్ తో కావాలనే కనెక్ట్ అయ్యాడు. అలాగే వాళ్ల గ్రూప్ లో మెంబర్ షిప్ తీసేసుకున్నాడు. గతవారం నామినేషన్స్ లో మనవాళ్లే ఎక్కువగా ఉన్నారుగా.., మీరు కూడా ఇద్దరుంటే బాగుండేదని నోరుజారాడు. మనవాళ్లు అంటే ఇక్కడ శివాజీ గ్రూప్ అన్నమాట. ఫస్ట్ నుంచీ ప్రియాంక – శోభా ఇద్దరినే టార్గెట్ చేశాడు. అలాగే అశ్విని కూడా భోలే రూట్ లోనే నడిచింది.

నెంబర్ – 2

భోలే ఫస్ట్ నామినేషన్స్ లోకి వచ్చినపుడే శోభాశెట్టి ఊహించింది. కానీ, అప్పుడు అనూహ్యంగా పూజా వెళ్లిపోయేసరికి షాక్ అయ్యింది. స్టార్ మా బ్యాచ్ బయట ఎలా ఉన్నారో తెలుసుకున్న భోలే బయట చూసి వచ్చిన తర్వాత పూర్తిగా అటుసైడే టార్గెట్ చేశాడు. అంతేకాదు టాస్క్ లో తన ఆటని ఎక్కడా కూడా కనబడేలా ఆడలేదు.

నెంబర్ – 3

టాస్క్ లో పూర్ పెర్పామన్స్ ఇచ్చాడు. వచ్చిన వారమే కెప్టెన్సీ పోటీదారుల రేస్ నుంచీ తప్పుకుని శివాజీకి త్యాగం చేశాడు. అలాగే, శివాజీని పొగుడుతూ, పల్లవి ప్రశాంత్ ని పొగుడతూ భజన చేయడం స్టార్ట్ చేశాడు. తన గేమ్ ని పక్కనబెట్టేశాడు. పైగా నా మనసు చెప్పింది, ఆత్మ చెప్పింది విని బాల్స్ టాస్క్ లో టీమ్ లోకి మారాను అని కహానీలు చెప్పాడు. ఆ తర్వాత భోలే అతి ముఖ్యమైన పవర్ బాల్ గురించి కూడా ఆర్గ్యూమెంట్ చేయలేదు. అంతేకాదు, కెప్టెన్సీ కంటెండర్ గా కూడా అవ్వలేకపోయాడు. ఆట స్వరూపాన్ని మార్చే ఛాన్స్ ఉన్నా కూడా చేయలేకపోయాడు.

నెంబర్ – 4

ఎంటర్ టైన్మెంట్ పరంగా కూడా ఒకసైడే ఎక్కువగా ఉండిపోయాడు. కేవలం శివాజీ, అశ్విని, పల్లవి, వీళ్లతో మాత్రమే కలిశాడు తప్ప మిగతా వారితో మింగిల్ అవ్వలేదు. అంతేకాదు, తన గేమ్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోలేకపోయాడు. అందుకే ఎలిమినేట్ అయ్యాడు.

నెంబర్ – 5

భోలే షవాలికి సోషల్ మీడియాలో పెద్దగా ఫాలోయింగ్ లేదు. లాస్ట్ టైమ్ శివాజీ – పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ లో లేరు కాబట్టి భోలేకి ఎక్కువగా ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. కానీ ఈవారం శివాజీ నామినేషన్స్ లో ఉండటం అనేది భోలేకి మైనస్ అయ్యింది. అందుకే, ఓటింగ్ లో లీస్ట్ లో ఉండిపోయాడు. అదీ మేటర్.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus