Yashoda Movie: యశోద మూవీకి పాజిటివ్ టాక్ వెనుక ఇంత జరిగిందా?

  • November 11, 2022 / 09:32 PM IST

స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతోందని కొన్నిరోజుల క్రితం సమంత అభిమానులకు తెలిసింది. ఆరోగ్య సమస్యల వల్ల సమంత యశోద ప్రమోషన్స్ కు సంబంధించిన పనులతో కూడా బిజీ కాలేదు. సుమతో ఇచ్చిన ఇంటర్వ్యూ మినహా సమంత ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. అయితే విడాకుల నేపథ్యంలో సమంత విషయంలో అక్కినేని ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. సమంతనే విడాకులు కోరిందని చైతూ అందుకే విడాకులు ఇచ్చాడని చాలామంది భావిస్తున్నారు.

సమంత సినిమాలు రిలీజైన సమయంలో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయాలని అక్కినేని అభిమానులు భావించారని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే యశోద సినిమా రిలీజ్ సమయంలో అక్కినేని ఫ్యాన్స్ సైలెంట్ అయ్యారు. సమంతపై జాలి చూపించి ఫ్యాన్స్ సైలెంట్ అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి. యశోద మూవీకి పాజిటివ్ టాక్ వస్తుండగా క్రిటిక్స్ నుంచి రివ్యూలు సైతం అనుకూలంగా వస్తున్నాయి. సమంత ఖాతాలో మరో సక్సెస్ దక్కినట్టేనని అయితే కమర్షియల్ గా ఈ సినిమా రిజల్ట్ తెలియాలంటే

మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. యశోద మూవీ సక్సెస్ తో సమంత తర్వాత సినిమాలకు కూడా బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోందని బోగట్టా. శాకుంతలం సినిమా 65 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద శాకుంతలం ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.

త్వరలో శాకుంతలం రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారికంగా స్పష్టత రానుంది. సమంత భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుండగా సమంత కొత్త ప్రాజెక్ట్ లను ఇప్పట్లో ప్రకటించబోరని సమాచారం అందుతోంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus