Star Heroes: ఈ 10 సినిమాల్లోనూ హీరోల ఫస్ట్ ఎంట్రీల కంటే కూడా సెకండ్ ఎంట్రీలు అదిరిపోతాయి.!

స్టార్ హీరోల (Star Heroes) సినిమాల్లో.. వారి ఎంట్రీ సీన్స్ ని చాలా కాస్ట్ లీ..గా డిజైన్ చేయిస్తారు దర్శకులు. అభిమానులకి కావాల్సింది కూడా అదే. అయితే కొన్ని స్టార్ హీరోల సినిమాల్లో ఫస్ట్ ఎంట్రీ కంటే కూడా సెకండ్ ఎంట్రీ గూజ్ బంప్స్ తెప్పించిన సందర్భాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటో.. ఆ సెకండ్ ఎంట్రీలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

Star Heroes

1) ఇంద్ర (Indra) :

ఈ సినిమాలో స్టార్టింగ్లో సీన్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గంగానదిలో స్నానం చేస్తున్నప్పుడు శివునితో పోల్చి మంచి హై ఇస్తారు. అలాగే సెకండాఫ్ లో వైట్ డ్రెస్ లో చిరు హెలికాప్టర్ దిగి నేలని ముద్దు పెట్టుకునే సీన్ కూడా మంచి హై ఇస్తుంది. అలా ఫస్ట్ ఎంట్రీ కంటే కూడా క్లైమాక్స్ లో ఇచ్చే సెకండ్ ఎంట్రీ బాగా హైలెట్ అవుతుంది.

2) లక్ష్మీ (Lakshmi) :

వెంకటేష్ (Venkatesh Daggubati) నటించిన ‘లక్ష్మీ’ సినిమాలో.. ఫస్ట్ ఎంట్రీ ఓల్డ్ సిటీలో ఉంటుంది. దాన్ని చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారు దర్శకులు వినాయక్ (V. V. Vinayak) . ఇక సెకండాఫ్ లో అదీ ప్రీ క్లైమాక్స్ లో కలకత్తా ఫైట్ లో వెంకటేష్ సెకండ్ ఎంట్రీ కూడా గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది.

3) పోకిరి (Pokiri) :

మహేష్ బాబు (Mahesh Babu) ఈ సినిమాలో ముందుగా పండుగా ఎంట్రీ ఇస్తారు. అది ఓ రేంజ్లో ఉంటుంది. అయితే క్లైమాక్స్ లో కృష్ణ మనోహర్ ఐపీఎస్ గా ఇచ్చే ఎంట్రీకి థియేటర్లు షేక్ అయ్యాయి. మహేష్ బాబుకి తిరుగులేని స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది ఆ సెకండ్ ఎంట్రీనే అని చెప్పాలి.

4) విక్రమార్కుడు (Vikramarkudu) :

ఈ సినిమాలో రవితేజ (Ravi Teja) పాత్రని రెండు డిఫరెంట్ షేడ్స్ లో చూపించాడు దర్శకుడు రాజమౌళి (S. S. Rajamouli). ఫస్ట్ ఎంట్రీ అత్తిలి సత్తిగా.. సెకండ్ ఎంట్రీని విక్రమ్ రాథోడ్ గా చూపించాడు. అయితే ఫస్ట్ ఎంట్రీ కంటే కూడా.. సెకండాఫ్ లో ప్రకాష్ రాజ్ (Prakash Raj) డైలాగ్స్ తో వచ్చే విక్రమ్ రాథోడ్ ఎంట్రీ మంచి కిక్ ఇస్తుంది.

5) గబ్బర్ సింగ్ (Gabbar Singh) :

ఈ సినిమాలో ముందుగా గుర్రపు స్వారీ చేస్తూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంటర్వెల్ సీక్వెన్స్ వద్ద జీప్ దిగుతూ పవన్ ఇచ్చే సెకండ్ ఎంట్రీ ఫ్యాన్స్ తో విజిల్ కొట్టిస్తుంది.

6) రేసుగుర్రం (Race Gurram) :

అల్లు అర్జున్ (Allu Arjun) ఈ సినిమాలో ముందుగా టైటిల్ కి తగ్గట్టే గుర్రాల నడుమ పరిగెత్తుకుంటూ ఎంట్రీ ఇస్తాడు.అది బాగుంటుంది. అయితే సెకండాఫ్ లో అదీ క్లైమాక్స్ లో అతను పోలీస్ గా ఎంట్రీ ఇచ్చే సీన్ మరింత ఆకట్టుకుంటుంది.

7) సింహా (Simha) , లెజెండ్ (Legend) , అఖండ (Akhanda) :

బోయపాటి (Boyapati Srinu) .. బాలయ్యతో (Nandamuri Balakrishna) తీసిన ఈ మూడు సినిమాల్లోనూ ఫస్ట్ ఎంట్రీ కంటే సెకండ్ ఎంట్రీ హైలెట్ అనిపిస్తుంది. ‘సింహా’లో సెకండాఫ్ లో వచ్చే డాక్టర్ రోల్ కావచ్చు, ‘లెజెండ్’ లో ఇంటర్వెల్ వద్ద వచ్చే పెద్ద బాలయ్య ఎంట్రీ కావచ్చు, ‘అఖండ’ లో ఇంటర్వెల్ బ్లాక్ వద్ద వచ్చే అఘోరా ఎంట్రీ కావచ్చు ఓ రేంజ్లో ఉంటాయి.

8) ఆర్.ఆర్.ఆర్ (RRR) (ఎన్టీఆర్)  (Jr NTR)  :

‘జై లవ కుశ’ (Jai Lavakusha) లో ఫస్ట్ ఎంట్రీ కంటే ఇంటర్వెల్ వద్ద వచ్చే రావణ్ క్యారెక్టర్ ఎంట్రీ మంచి కిక్ ఇస్తుంది. అలాగే ఆర్.ఆర్.ఆర్ లో టైగర్ ఛేజింగ్ ఎపిసోడ్ వద్ద వచ్చే ఎన్టీఆర్ ఎంట్రీ కంటే.. ఇంటర్వెల్ వద్ద అన్ని రకాల జంతువుల నడుమ ఎన్టీఆర్ ఇచ్చే ఎంట్రీ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది.

9) ఆర్.ఆర్.ఆర్(రాంచరణ్) (Ram Charan)  :

‘మగధీర’ (Magadheera) లో మాత్రమే కాదు ‘ఆర్.ఆర్.ఆర్’ లో కూడా చరణ్ 2 రకాల ఎంట్రీలు ఇచ్చాడు. ఫస్ట్ లో బ్రిటిష్ పోలీస్ గా, క్లైమాక్స్ లో అల్లూరి సీతారామరాజుగా అదిరిపోయే ఎంట్రీలు ఇస్తాడు చరణ్.

10) బాహుబలి (Baahubali) ,కల్కి 2898 ad (Kalki 2898 AD) :

‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ లో 2 రకాల ఎంట్రీలు అదిరిపోతాయి. రాజమౌళి (S. S. Rajamouli) ప్రభాస్  (Prabhas)  ని ప్రజెంట్ చేసిన తీరు అదిరిపోతుంది. అలాగే ‘కల్కి 2898 ad’ లో ప్రభాస్ భైరవగా ఇచ్చిన ఎంట్రీ కంటే క్లైమాక్స్ లో కర్ణ..గా ఇచ్చిన ఎంట్రీ వారేవా అనిపిస్తుంది.

డబుల్ ఇస్మార్ట్ కు అలీ ప్లస్ అవుతారా.. ఆ రోల్ ఫ్యాన్స్ కు మెప్పిస్తుందా?

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus