మహేంద్ర బాహుబలి చేతిలోని ఆయుధాలపై ఓ కథ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు (అక్టోబర్ 23) సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గత శనివారం విడుదల చేసిన బాహుబలి కంక్లూజన్ చిత్రం ఫస్ట్ లుక్ పై మిశ్రమ స్పందన లభించింది. వీర పరాక్రమ ఠీవి తో ఆగ్రహంతో నడిచి వస్తున్న ప్రభాస్ ని చూసి కొంతమంది సూపర్ అంటుంటే, రాజుల కాలంలో సిక్స్ ప్యాక్ ఏమిటని మరికొంతమంది విమర్శిస్తున్నారు. ఇది ఇలా ఉంటే మహేంద్ర బాహుబలి చేతిలోని ఆయుధాలపై ఓ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఒక చేత్తో కత్తి, మరో చేతిలో గొలుసు చుట్టుకున్న ఈ స్టిల్  క్లైమాక్స్ లో వస్తుందని బాహుబలి అభిమానులు డిసైడ్ చేశారు. తన తండ్రి అమరేంద్ర బాహుబలిని చంపిన వాడి అంతు చూసేందుకు ఆయన కత్తిని ఒక చేత్తో పట్టుకున్నాడని, తన తల్లి దేవసేన ను గొలుసులతో కట్టి బంధించి శిక్షించినందుకు వాటిని మరో చేతిలో చుట్టుకొని ప్రతీకారాన్ని తీర్చుకోవటానికి మహేంద్ర బాహుబలి బయలు దేరాడని వివరిస్తున్నారు. దీనిపై దర్శకధీరుడు రాజమౌళి ఏమి స్పందించక పోయినా, బాహుబలి 2 ఫస్ట్ లుక్ వెనుక స్టోరీ అదేనని నెటిజనులు నమ్ముతున్నారు. మరి మీరేమంటారు ?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus