మంచు మనోజ్.. మార్చి 3న భూమా మౌనికను పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. ఇది అతనికి రెండో పెళ్లి. గతంలో ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.కానీ ఆ తర్వాత ఆమెతో మనస్పర్థలు రావడంతో విడిపోయాడు. అయిష్టంగానే ఆమెతో విడిపోయాడు మనోజ్. ఈ క్రమంలో అతను డిప్రెషన్ కు కూడా లోనయ్యాడు. కొన్నాళ్ల పాటు అతను సినిమాలకు కూడా దూరమైన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఇతను భూమా మౌనికతో ప్రేమలో పడ్డాడు.
2022 వినాయక చవితి, ఖైరతాబాద్ లో జరిగిన వేడుకల్లో మనోజ్…భూమా మౌనికతో కలిసి మీడియాకి చిక్కాడు. అప్పటి నుండి అతను మౌనికతో కలిసి జీవిస్తున్నట్టు టాక్ నడిచింది. కుటుంబ సభ్యులకు వీరి పెళ్లి ఇష్టం లేకపోయినా.. ఇన్ని రోజులు వెయిట్ చేసి పెళ్లి చేసుకున్నారు. మంచు లక్ష్మీ.. కుటుంబ సభ్యులను ఒప్పించి వీరి పెళ్లి చేసింది. అందరికీ తెలిసింది ఇంతవరకే..! కానీ మనోజ్ – మౌనిక ల పెళ్ళికి చాలా కథ జరిగిందనేది ఇన్సైడ్ టాక్.
మౌనికకి కూడా ఇది రెండో పెళ్లి అన్న సంగతి తెలిసిందే. నిజానికి భూమా మౌనిక తన మొదటి భర్తకు విడాకులివ్వడానికి ప్రధాన కారణం.. మంచు మనోజ్ అని తెలుస్తుంది.’మాది 12 సంవత్సరాల స్నేహం, 4 సంవత్సరాల ప్రేమ’ ఇటీవల మనోజ్ మీడియా ముందు చెప్పాడు. గతంలో కూడా వీరు ప్రేమించుకున్నారు. కానీ ఈ విషయాన్ని వీరు బయటకు చెప్పుకోలేదు. అలా చెప్పుకోకపోవడం వల్ల వీరికి పెళ్లిళ్లు అయ్యాయి.
భూమా మౌనికకు మొదటి పెళ్లైన తర్వాత… మనోజ్ తో గంటలు గంటలు ఫోన్లో మాట్లాడేదట. దీంతో మౌనిక మొదటి భర్త గణేష్ రెడ్డి కోపగించుకోవడం, దీంతో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడటం విషయం విడాకుల వరకు వెళ్ళింది. ‘ఏది ఏమైనా వీరి ప్రేమ బలమైనదనుకుంట. అందుకే ఈ జన్మలోనే మళ్ళీ ఒక్కటయ్యారు’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!