Mahesh Babu: రాజమౌళి కంటే త్రివిక్రమ్ తోపా.. మహేష్ తో చేస్తే తప్పేంటి?

ఇండస్ట్రీలో జోరుగా జరుగుతున్న చర్చ ఇది. ఓ పెద్ద సంస్థకు చెందిన వ్యక్తి లేవనెత్తిన ప్రశ్న ఇది. మహేష్ 28 వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఈ చిత్రం షూటింగ్ కు కొంత బ్రేక్ వచ్చింది. ఈ గ్యాప్ లో మహేష్ కూడా విదేశాలకు వెళ్ళాడు. ఓ ఫ్యామిలీ పని రీత్యా ఆయన విదేశాలకు వెళ్లినట్టు టాక్.

ఇది పక్కన పెడితే, మహేష్ షూటింగ్ మధ్యలో ఇలా విదేశాలకు వెళ్ళడం వెనుక ఎన్నో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ మొదటి షెడ్యూల్ తో సంతృప్తి చెందలేదు అని అందుకే ఇలా విదేశాలకు వెళ్ళాడు అని అంతా అనుకుంటున్నారు. మరి కొంతమంది అయితే మహేష్ తో.. త్రివిక్రమ్ సినిమా చేయాల్సిన పని లేదు అని. ఆయన ఓకె అనుకుంటే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ వంటి స్టార్ హీరోలు కూడా రెడీగా ఉన్నారు అనేది వారి వాదన.

ఈ మాత్రం త్రివిక్రమ్ కు తెలీదా..? హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో మహేష్ సినిమా చెయ్యాలి. శ్రీమంతుడు టైంలోనే ఈ సంస్థ మహేష్ కు అడ్వాన్స్ ఇచ్చింది. ఈ సంస్థలో సినిమా అంటే త్రివిక్రమ్ తోనే చెయ్యాలి. అలాగే త్రివిక్రమ్ కు మహేష్ అంటే చాలా అభిమానం. నువ్వే నువ్వే సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే అతడు చేయడానికి మహేష్ ఓకె చెప్పాడు. ఈ విషయం స్వయంగా త్రివిక్రమ్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఖలేజా ఫ్లాప్ అయ్యాక మహేష్ కు త్రివిక్రమ్ చాలా స్క్రిప్ట్ లు వినిపించాడు.

అఆ కూడా మహేష్ చేయాల్సిన మూవీనే. కానీ అది తన ఇమేజ్ కు సూట్ అవ్వదు అని పక్కన పెట్టాడు. మహేష్ కూడా … కావాలనుకుంటే సుకుమార్ వంటి అగ్ర దర్శకులతో సినిమాలు చేయొచ్చు. రాజమౌళి తో సినిమా ఓకె అయ్యింది కూడా..! పోనీ రాజమౌళి మహేష్ తో సినిమా చేయనవసరం లేదు అని అనుకున్నా ఓ రకం. కానీ త్రివిక్రమ్ అత్తారింటికి దారేది తర్వాత సరైన హిట్టు కొట్టింది అల వైకుంఠపురములో తోనే. అఆ హిట్ అయినా ఆ చిత్రం కథ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ విషయాన్ని జనాలు ఎలా మర్చిపోయారో..!

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus