హిట్స్, ప్లాప్స్ అనే వాటితో సంబంధం లేకుండా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. టాక్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు రూ.100 కోట్ల వరకూ వసూళ్లు సాధిస్తూ ఉంటాయి. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా పవన్ కళ్యాణ్ పలు సినిమాలు రూపొందించారు.’పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ అనే బ్యానర్ ను స్థాపించి ‘ఛల్ మోహన్ రంగ’ వంటి సినిమాని నిర్మించాడు. దాంతో పాటు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కు కూడా సహా నిర్మాతగా వ్యవహరించాడు.
ఆ రెండూ హిట్టవ్వ లేదు అనుకోండి. అయినప్పటికీ ఆ చిత్రాలకు పవన్ కళ్యాణ్ ఎటువంటి పెట్టుబడి పెట్టలేదు. తన బ్రాండ్ ను వాడుకుంటున్నారు కాబట్టి.. పవన్ కు నిర్మాతలు కొంత షేర్ ను ఇస్తారు అంతే. ఇదిలా ఉండగా.. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వారు ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ తో కలిసి సినిమాలు నిర్మించడానికి డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 15 సినిమాలు నిర్మించడానికి ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వారు రెడీ అయ్యారు.
ఇక నుండీ పవన్ కళ్యాణ్ బ్రాండ్ ను వాడుకుంటారు కాబట్టి.. అతనికి కొంత పే చేస్తారు అన్న మాట.ఒకవేళ సినిమా హిట్ అయ్యి లాభాలు కూడా వస్తే అందులో కూడా పవన్ కళ్యాణ్ కు వాటా ఉంటుందన్న మాట. ఈ 15 సినిమాలకు ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వారు రూ.150 కోట్ల వరకూ బడ్జెట్ పెట్టబోతున్నారట.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!