Aamir Khan: డ్రింకింగ్‌ అలవాటు గురించి మాట్లాడిన మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌!

మందు తాగే అలవాటు ఎంత చెడ్డదో, మానడమే అంతే కష్టం అంటారు. మందు అలవాటు మానేసివాళ్లు, అలాంటి వాళ్ల గురించి తెలిసినవాళ్లకు ఈ విషయం బాగా తెలుసు. ఇలా మందు మానేసినవారిలో సెలబ్రిటీలు కూడా ఉంటారు. ఆ జాబితాలో ఆమిర్‌ ఖాన్‌ కూడా ఒకరు. బాలీవుడ్‌లో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌గా పేరున్న ఆమిర్‌ ఖాన్‌కు మందు అలవాటు ఉందా? అని అనుకుంటున్నారా. అవును, ఆయనకు అలవాటు ఉండేది, ఇప్పుడు మానేశారు కూడా. ఆ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చారు.

Click Here To Watch Now

నేను గతంలో మద్యం సేవించేవాడిని. అయితే ఇప్పుడు తీసుకోవడం లేదు అంటూ మద్యం గురించి మాట్లాడాడు ఆమిర్‌ ఖాన్‌. అంతేకాదు మద్యపానం గురించి, తను మద్యం తాగే రోజుల గురించి కూడా వివరించారు ఆమిర్‌. మామూలుగా కొంత మంది డ్రింకింగ్‌ చేసేటప్పుడు ఒకటో, రెండు పెగ్గులు వేస్తారు. అయితే తాను మాత్రం కూర్చుంటే సీసాకి సీసా లేపేసేవాడిని అని చెప్పాడు ఆమిర్‌. అలా అని రోజూ తాగేవాడు కాదట. ఎప్పుడో అకేషనల్‌గా ఓసారి తాగేవాడట.

అయితే మద్యం తాగడం… మంచిగా అనిపించలేదట. అందుకే మానేశా అని చెప్పాడు ఆమిర్‌. మద్యం మత్తులో ఉన్నప్పుడు మనుషులు చేసే పనుల వల్ల… మాటల వల్ల ఆ తర్వాత చాలా బాధపడతాం అని చెప్పాడు ఆమిర్‌. అయితే ఆయన విషయంలో ఎప్పుడూ అలా జరగలేదట. మందులో ఉన్నప్పుడు మనిషికి కంట్రోల్‌ ఉండదు. ఈ విషయం గ్రహించే మందు మానేశాను అని చెప్పాడు ఆమిర్ ఖాన్‌. ‘సత్యమేవ జయతే’ టాక్‌ షో హోస్ట్ చేసినప్పుడు ఆమిర్ ఖాన్ మద్యం మీద ఓ ఎపిసోడ్‌ కూడా చేసిన విషయం తెలిసిందే.

దీంతోపాటు మాజీ భార్య కిరణ్ రావ్‌ గురించి కూడా ఆమిర్‌ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కిరణ్‌ రావ్‌ అంటే నాకెంతో గౌరవం. మా ఇద్దరికీ ఒకరిపై మరొకరికి ప్రేమ ఉంది. భార్యాభర్తలుగా మా బంధంలో మార్పు వచ్చినా… మేం కలసి పని చేస్తున్నాం అని చెప్పాడు ఆమిర్‌ ఖాన్‌. ఎంతైనా మందు మానేడయం గ్రేట్‌.. అంతేకాదు అలవాటు ఉండేది అని చెప్పి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడమూ గ్రేటే.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus