Adivi Sesh: అడివి శేష్ ‘గోల్డెన్ రూల్’?

అడివి శేష్ ‘సొంతం’ వంటి సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ‘బలుపు’ ‘పంజా’ ‘బాహుబలి’ ‘ఊపిరి’ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు. తర్వాత హీరోగా మారి ‘కర్మ’ ‘కిస్’ వంటి సినిమాల్లో కూడా నటించాడు. అవి ఫ్లాప్ అయ్యాయి. దీంతో మళ్ళీ ‘దొంగాట’ ‘సైజ్ జీరో’ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయాల్సి వచ్చింది. ఫైనల్ గా ‘క్షణం’ తో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి ఓ హిట్ అందుకున్నాడు. అప్పటి నుండి అపజయమెరుగని హీరోగా దూసుకుపోతున్నాడు.

Adivi Sesh

ప్రస్తుతం ‘డెకాయిట్’ ‘గూఢచారి 2’ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. అవి త్వరలో రిలీజ్ కాబోతున్నాయి. అయితే నిన్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం గెస్ట్ గా వచ్చాడు అడివి శేష్. ఈ క్రమంలో అతను పెట్టుకున్న గోల్డెన్ రూల్ గురించి చెప్పి హాట్ టాపిక్ అయ్యాడు. విషయం ఏంటంటే.. నిన్న ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరూ చిన్న సినిమాలకు అడివి శేష్ ఎప్పుడూ అండగా నిలుస్తారు అంటూ భజన చేయడం మొదలుపెట్టారు. బన్నీ వాస్ మరో నిర్మాత వంశీ నందిపాటి, ఈటీవీ విన్ నితిన్, సాయి.. నుండి చివరికి హీరో, హీరోయిన్లు కూడా ఇదే విధంగా అడివి శేష్ ని మోసేసారు.

దీంతో తర్వాత అడివి శేష్ అసలు విషయాన్ని చెప్పి వారికి క్లారిటీ ఇచ్చాడు. ‘నేను ఏ సినిమాను ప్రమోట్ చేసినా, ప్రమోషనల్ ఈవెంట్లకి గెస్ట్ గా వచ్చినా.. అది కంటెంట్ నచ్చడం వల్లే చేశాను. కాబట్టి.. నేను ప్రతి సినిమాను ప్రమోట్ చేస్తాను అని కాదు. నేను ఒక గోల్డెన్ రూల్ పెట్టుకున్నాను. ఆ గోల్డెన్ రూల్ మరేదో కాదు మంచి కంటెంట్. నాకు కంటెంట్ కనుక నచ్చితే వచ్చి సినిమాను ప్రమోట్ చేస్తాను. నేను కంటెంట్ ని నమ్ముకునే ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి వేరే సినిమాల విషయంలో కూడా కంటెంట్ నే నమ్ముతాను’ అంటూ తనకు భజన చేసిన బ్యాచ్ కి చిన్న కౌంటర్ కూడా వేశాడు శేష్. అది మేటర్.

 

సీనియర్ నటి మృతి.. శోకసంద్రంలో ఇండస్ట్రీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus