మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన సినిమాల గురించి, ఫ్యామిలీ గురించి మాత్రమే కాకుండా పక్క హీరోల సినిమాల గురించి, అలాగే హీరోల పుట్టినరోజులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు. ఇదే క్రమంలో ఈరోజు చిరు రాజకీయాలపై ఓ డైలాగ్‌ను పోస్ట్ చేశారు. ‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అంటూ చిరు ఓ ఆడియో క్లిప్ ను పోస్ట్ చేశారు.
ఈ డైలాగ్ పెద్ద చర్చకే దారితీసింది. రాజకీయాలు చిరంజీవిని మరియు అతని ఫ్యామిలీని ఎంతలా డిస్టర్బ్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం, 2009 ఎన్నికల్లో ఓడిపోవడం, 2010 లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, కొన్నాళ్ళు మంత్రిగా కొనసాగిన ఆయన శాశ్వతంగా రాజకీయాలకు దూరం అవుతున్నట్టు ప్రకటించడం అందరికీ తెలిసిన విషయమే.! ఆ తర్వాత ఆయన ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా ఫ్యామిలీతో గడుపుతున్నారు.
అయితే వైసీపీ నేతలు, బీజేపీ నేతలు చిరు క్రేజ్ ను వచ్చే ఎన్నికల్లో వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు అన్నది వాస్తవమే. అయితే నాగబాబు మాత్రం ‘జనసేన’ ఉండగా అన్నయ్య వేరే పార్టీలో చేరడం కష్టం. అన్నయ్య రాజకీయాలకు దూరంగా హ్యాపీగా ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు. మరి ఈ డైలాగ్ సంగతేంటి అనే డౌట్ అందరిలో ఉంది. విషయంలోకి వెళ్తే చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం అక్టోబర్ 5న రిలీజ్ కాబోతుంది.
ఇది మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కు రీమేక్. ఈ చిత్రానికి పొలిటికల్ టచ్ ఉంటుంది. ఈ సినిమాలో చిరు పాత్ర రాజకీయాలకు దూరంగా ఉంటూనే రాజకీయాలను శాసిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆ డైలాగ్ వస్తుందని స్పష్టమవుతుంది. నిజానికి ఈ మూవీ పై పెద్దగా హైప్ లేదు. ఈ డైలాగ్ తో బజ్ క్రియేట్ చేయాలన్నది చిత్ర బృందం ప్లాన్ గా తెలుస్తుంది.
Most Recommended Video
శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!