Dil Raju: ‘ఎఫ్‌ 3’ రిలీజ్‌ డేట్‌ అందుకే మారిందా!

ఎప్పుడూ చెప్పుకునే మాటే… అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ‘ఆచార్య’ సినిమా వసూళ్ల గురించి, అందులో నటీనటుల పర్‌ఫార్మెన్స్‌ గురించి మాట్లాడుకునే టైమ్‌ ఇది. కానీ కరోనా ఆడి ఆట, ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న ‘అతి’ ప్రేమ కారణంగా ఆ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇటీవల కొత్త సినిమా డేట్‌ను ప్రకటించారు. ఏప్రిల్ 29న విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ వెంటనే ‘ఎఫ్‌ 3’ సినిమాను ఏప్రిల్‌ 28 రిలీజ్‌ చేస్తామని చెప్పేశారు. అయితే దీని వెనుక పెద్ద కారణమే ఉందని ఇండస్ట్రీలో చెవులు కొరుక్కున్నారు. కానీ ఆ ఇబ్బంది తొలగిపోయినట్లుంది.

Click Here To Watch

పిల్లలు పరీక్షలు ముగించుకోండి. పెద్దలు సమ్మర్‌ సందడికై తయారుకండి. ఫన్‌ పిక్నిక్‌కు డేట్‌ ఫిక్స్‌ చేశాం అంటూ ‘ఎఫ్‌ 3’ సినిమా కొత్త రిలీజ్‌ డేట్‌ను సోమవారం చిత్రబృందం అనౌన్స్‌ చేసింది. పిల్లల పరీక్షలు అయిపోయి, సూర్యుడు ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నప్పుడు అంటే మే 27న విడుదల చేస్తాం అంటూ ప్రకటించారు. సినిమా వాయిదాకు సరైన కారణం చెప్పలేదు కానీ… చిరంజీవి ఫ్యాన్స్‌కి ఈ న్యూస్‌ పెద్ద రిలీఫ్‌ అనే చెప్పాలి. చిరంజీవి, రామ్‌చరణ్‌ – వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ సినిమాలు ఇలా బాక్సాఫీసు దగ్గరకు ఒకేసారి వచ్చి… ఇబ్బంది పడటం ఫ్యాన్స్‌కి నచ్చలేదు.

దిల్‌ రాజు సినిమాతో పోటీగా చిరంజీవి సినిమాకు సరిపడే థియేటర్లు దొరుకుతాయా అనే ప్రశ్న వారిని వేధించింది. ఈ మాటలు దిల్‌ రాజున చెవిన పడ్డాయో లేక ఇంకేదో కారణం కానీ సినిమా రిలీజ్‌ డేట్‌ను మార్చేశారు. అయితే సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న వెర్షన్‌ వేరేగా ఉంది. ‘ఆచార్య’ సినిమా నైజాం హక్కులు వరంగల్‌ శ్రీను కైవసం చేసుకున్నారు. దీంతో ఈ సినిమాపై దిల్‌ రాజు కినుక వహించడానికి నెటిజన్ల టాక్‌. అందుకే అన్ని పెద్ద సినిమాలకు గ్యాప్‌ ఉండేలా చూసుకున్న దిల్‌ రాజు అండ్‌ కో. ‘ఆచార్య’ విషయంలో గ్యాప్‌ ఇవ్వలేదు అన్నారు. కానీ ఇప్పుడు అంతా ఓకే అయ్యింది. ‘ఎఫ్‌ 3’ వాయిదా పడింది.

అయితే ఇక్కడ మరో సమస్య వచ్చి పడింది. కొత్తగా చెప్పిన డేట్‌ మే 27న అడివి శేష్‌ ‘మేజర్‌’ సినిమా ఉంది. వీళ్లు ఎప్పుడో ప్రకటించిన డేట్‌ ఇది. మరిప్పుడు ‘ఎఫ్‌ 3’ వస్తున్న నేపథ్యంలో ‘మేజర్‌’ డేట్‌ మారుతుందా అనే ప్రశ్న ఉదయించింది.‘మేజర్‌’ని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించారు. కాబట్టి హిందీ, మలయాళం మార్కెట్ కూడా ముఖ్యమే. కాబట్టి తెలుగులో ఉన్న థియేటర్లతో సరిపెట్టుకుని, మిగిలిన మార్కెట్‌ నుండి ఎక్కువ లాగే ప్రయత్నం చేస్తారో లేదంటే… వాయిదా వేస్తారో చూడాలి.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus