Mike Tyson: మైక్‌ టైసన్‌ ‘లైగర్‌’లోకి ఎలా వచ్చాడంటే?

  • August 24, 2022 / 03:41 PM IST

‘లైగర్‌’ ఎలా ఉంటుంది? విజయ్‌ ఎలా నటించాడు? రమ్యకృష్ణ పాత్ర సంగతేంటి? మైక్‌ టైసన్‌ ఫైట్‌ ఉందా? ఇలాంటి వాటికి సమాధానాలు తెలియడానికి ఇంకో 24 గంటలు ఆగాల్సిందే. అయితే ఈ సినిమాలో మైక్‌ టైస్‌ను ఎందుకు తీసుకున్నారు? ఎలా ఆయన్ను ఒప్పించారు అనేది ఆసక్తికరంగా మారింది. దీని గురించి దర్శకుడు పూరి జగన్నాథ్‌, నిర్మాత ఛార్మి ఇటీవల చెప్పారు. అన్నీ ఓ చోట చేర్చి చూస్తే.. మైక్‌ టైసన్‌ కోసం చాలానే కష్టపడ్డారు. అవేంటో చూసేయండి.

‘లైగర్‌’ సినిమాలో విజయ్‌ దేవరకొండ, మైక్‌ టైసన్‌ ఫైట్ చేస్తారా? రింగ్‌లో నువ్వా నేనా అనేట్లు పోటీ పడతారా అని ప్రశ్నలు అయితే కనిపిస్తున్నాయి. అయితే దీనిపై సినిమా బృందం నుండి క్లారిటీ వచ్చింది. టైసన్‌, విజయ్‌ రింగ్‌లో దిగే సీన్స్‌ ఏవీ లేవట. అయితే బయట వీరిద్దరి మధ్య స్టయిలిష్‌ ఫైట్‌ అయితే ఉంటుంది అని అంటున్నారు. విజయ్‌, మైక్‌ టైసన్‌ మధ్య ఫైట్‌ సీక్వెన్స్‌ ఉంది. అయితే అది కేజ్‌లో కాదు. కేజ్‌ నేపథ్యంలో సాగే ఫైట్స్‌లో ఇతర నటులు కూడా కనిపిస్తారు అని చెప్పారు.

‘లైగర్‌’ సినిమాలో కీలక పాత్ర కోసం మైక్‌ టైసన్‌ను తీసుకోవాలని ఎందుకు అనిపించిందో మాకే తెలియదు. అయితే అనుకున్నాక తనని ఈ సినిమాలో నటించడానికి ఒప్పించడానికి సంవత్సరం పట్టింది’’ అని చెప్పారు పూరి జగన్నాథ్‌. సినిమాలో పాత్ర కోసం టైసన్‌ టీమ్‌కి వందల సంఖ్యలో మెయిల్స్‌ పంపారట. ఆ తర్వాత జూమ్‌ కాల్స్‌ మాట్లాడారట. టైసన్‌ టీమ్‌ నుండి అయితే.. ‘ఆయన ఇది చేయరు.. అది చేయరు. మాకు స్క్రిప్టు పంపండి’’ అని అడిగారట.

అలా వాళ్లు చెప్పినవన్నీ చేసి, మాట్లాడి మాట్లాడి ఏడాది తర్వాత ఆయనను ఒప్పించగలిగాం అని చెప్పారు పూరి. అన్ని ప్రయత్నాల తర్వాత లాస్‌ వేగాస్‌లో చిత్రీకరణ అనుకున్నాం. టైసన్‌ వస్తున్నారంటే సినిమాకి పనిచేసిన అక్కడి సాంకేతిక నిపుణులు నమ్మలేదట. షూటింగ్‌ రోజు ఉదయం విజయ్‌ దేవరకొండ వచ్చి ‘టైసన్‌ వస్తారా? ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటి?’ అని అడిగాడట. దాంతో పూరి జగన్నాథ్‌కి కూడా భయమేసిందట.

అవును, నిజమే టైసన్‌ రాకపోతే ఏం చేయాలి అనుకుంటుండగా ఆయన ఎంట్రీ ఇచ్చారట. టైసన్‌ పక్కన కూర్చొని విజయ్‌, పూరి ఆశ్చర్యపోయారట. మామూలుగా అయితే.. ఆయన చెప్పుల సైజు 20 అట. దీంతో ప్రత్యేకంగా చేయించాం అని పూరి జగన్నాథ్‌ చెప్పారు. అయితే ఇక్కడే ఒక డౌట్‌. మామూలు సమయంలో ఆయన షూస్‌ వేసుకుంటారు కదా. అవే వేసుకుంటే సరిపోతుందిగా మళ్లీ చేయించడం ఎందుకో?

అలాంటి టైసన్‌తో తలపడేందుకు శారీరకంగా, మానసికంగా ఎంత దృఢంగా ఉండాలి? దాని కోసం సుమారు రెండేళ్లు శ్రమించాడట విజయ్‌ దేవరకొండ. ఫిట్‌నెస్‌ విషయంలో విజయ్‌ ఎంతో శ్రద్ధ తీసుకున్నారని, టైసన్‌ ఫిజిక్‌కు తగ్గట్టు తనని తాను మార్చుకున్నారని విజయ్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కుల్‌దీప్‌ సేథి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంకిత భావంతో పనిచేశాడని ఆయన కొనియాడారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాలో విజయ్‌ సరసన అనన్య పాండే నటించింది. రమ్యకృష్ణ, గెటప్‌ శ్రీను, విష్ణురెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus