Rajamouli, Rajinikanth: రజనీకాంత్ , రాజమౌళి కాంబో అలా కాన్సిల్?

దర్శకధీరుడు రాజమౌళి చాలాసార్లు కొంత మంది స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడు. స్టూడెంట్ నెంబర్ వన్ అనంతరం ప్రభాస్ కూడా జక్కన్నతో సినిమా చేయనని అన్నాడు. సింహాద్రి సినిమాను రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ భారీ స్థాయిలో కథలను సిద్ధం చేసి ఉంచగా కొంత మంది స్టార్ హీరోలు వాటిని ఎంతగానో మెచ్చుకున్నారు. అయితే రాజమౌళి డైరెక్ట్ చేస్తాడు అని చెప్పగానే అతను ఎంతవరకు న్యాయం చేస్తాడు అనే విషయంలో కొంతమంది హీరోలు వెనుకడుగు కూడా వేశరట.

అయితే గతంలో రాజమౌళి రజనీకాంత్ తో కూడా ఓ సినిమా చేయాలని చర్చలు జరిపాడు దాదాపు ప్రాజెక్ట్ సెట్ అయినట్లే అయింది కానీ చివరి నిమిషంలో నిర్మాత ధైర్యం చేయకపోవడం వలన అనుకోకుండా క్యాన్సిల్ అయిందంట. నితిన్ సై నిర్మాత భారతి రాజమౌళితో ఎలాగైనా మరో సినిమా చేయాలని అనుకున్నాడు. సై సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేక పోవడంతో వారి కలయికలో మరో సినిమా ఉంటుందని కూడా అందరూ అనుకున్నారు.

అయితే నిర్మాత భారతి కూడా రాజమౌళి కథ సిద్ధం చేయాలని రజనీకాంత్ తో సినిమా చేయాలని చాలా ప్రయత్నాలు చేసాడు. అందుకోసం ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం తో కూడా మాట్లాడడం జరిగింది. వారిద్దరు సంయుక్తంగా రాజమౌళి రజనీకాంత్ సినిమాను తెరపైకి తీసుకురావాలని అనుకున్నారు. ఒక నెల రోజుల పాటు భారతి నిరంతరం చర్చలు జరిపాడు. కానీ ఎందుకో మళ్ళీ ఆర్థికంగా సరైన పరిస్థితులు కనిపించకపోవడంతో, ఏఏం.రత్నం పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో నిర్మాత భారతీయ వెనక్కి తగ్గినట్లుగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

అయితే చాలా సార్లు రాజమౌళి మాత్రం తనతో సినిమా చేయాలని అన్నాడని, వారితో ఇప్పటికీ కూడా మంచి సన్నిహిత్యం ఉన్నట్లుగా వివరణ ఇచ్చారు. ఒక విధంగా రాజమౌళి ఫ్యామిలీతో కూడా తమకు బంధుత్వం ఉందని వారు వివరణ ఇచ్చారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus