టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) తన 24 ఏళ్ల సినీ కెరీర్ లో కేవలం 12 సినిమాలను మాత్రమే తెరకెక్కించినా ఆ 12 సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ప్రేక్షకులను మెప్పించాయి. ఎంతోమంది హీరోలతో రాజమౌళి పని చేసినా చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన ఫేవరెట్ హీరో అని జక్కన్న వెల్లడించారు. తన సీన్ కు నూటికి నూరు శాతం న్యాయం చేసే హీరో తారక్ అని రాజమౌళి పేర్కొన్నారు.
అయితే రాజమౌళి తారక్ ను ఇంతలా ఇష్టపడటానికి మరో కారణం కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు సినిమా రిజల్ట్ ఏ మాత్రం ఆశించిన విధంగా లేకపోయినా దర్శకులను నిందిస్తూ ఉంటారు. దర్శకులు చేసిన పొరపాట్ల వల్లే తమకు సక్సెస్ దక్కలేదని భావిస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం డిఫరెంట్ అని తెలుస్తోంది.
సినిమా ఫ్లాపైనా కూడా దర్శకుడిని తారక్ ఒక్క మాట కూడా ఎప్పుడూ కామెంట్ చేయలేదట. ప్రతి సినిమాకు ఒకే విధంగా కష్టపడతామని కొన్నిసార్లు ఆశించిన ఫలితాలు రావని తారక్ భావిస్తాడే తప్ప దర్శకుడే సినిమా ఫ్లాప్ కు కారణమని ఎప్పుడూ ఫీలవ్వరట. ఈ రీజన్ వల్లే జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఎక్కువమంది ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చిన సందర్భాలు సైతం ఉన్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ దర్శకుల విషయంలో ఇలా వ్యవహరించడం రాజమౌళికి కూడా ఎంతో నచ్చుతుందని తెలుస్తోంది. సినిమా ఫ్లాపైన సమయంలో దర్శకులను నిందిస్తే ఆ దర్శకులు మరింత నిరాశా నిస్పృహలకు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తనతో పని చేసిన డైరెక్టర్లు ఫ్లాప్ ఇచ్చినా వాళ్లలో ధైర్యం నింపుతూ వాళ్ల తర్వాత సినిమాలు సక్సెస్ అయ్యేలా చేస్తున్నారు. ఇలాంటి హీరోలు అరుదుగా ఉంటారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.