Salaar Movie: ‘సలార్’ నుండీ ఫ్యాన్స్ కు గూజ్ బంప్స్ తెప్పించే అప్డేట్..!

  • July 7, 2021 / 11:39 AM IST

‘బాహుబలి’ తర్వాత వరుసగా పాన్ ఇండియా మూవీస్ చేయడానికి ప్రభాస్ కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘సాహో’ వంటి యాక్షన్ మూవీ, ‘రాధే శ్యామ్’ వంటి లవ్ స్టోరీ, ‘ఆదిపురుష్’ వంటి మైతిలాజికల్ మూవీస్ కు కమిట్ అయ్యాడు ప్రభాస్. కానీ ఈ టైములో ప్రభాస్ నుండీ మంచి మాస్ మూవీ వస్తే… అది 3 రెట్లు బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సలార్’ అదే స్థాయిలో ఉంటుందని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు.

రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనుంది. ప్రభాస్ సరసన శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ‘కె.జి.ఎఫ్’ సిరీస్ కు పని చేసిన టీం ఈ చిత్రానికి కూడా పనిచేస్తుండడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ‘సలార్’ మూవీకి సంబంధించి కొన్ని లీక్డ్ పిక్స్ నెట్టింట్లో సందడి చేసిన సంగతి తెలిసిందే.జనవరి నుండీ ఈ చిత్రానికి సంబంధించి ఫోటోలు లీక్ అవుతూనే వస్తున్నాయి. బైక్ పై ప్రభాస్ ఉన్న పిక్ ఒకటి అందరికీ గుర్తుండే ఉంటుంది.

అది ఓ సాంగ్ కు సంబంధించినదని ఇన్సైడ్ టాక్. దాని తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్లో ఉంటుందని వినికిడి. ఆ 15 నిముషాలు ప్రభాస్ అభిమానులకు పూనకాలు రావడం గ్యారెంటీ అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లీక్స్ వెనుక అంతా యాక్షన్ దాగుందా అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజముందో..!

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus