Maha Samudram Movie: ‘మహాసముద్రం’ డైరెక్టర్ కు రంభ స్పెషల్ పర్మిషన్..!

శ‌ర్వానంద్ హీరోగా…ఒకప్పటి లవర్ బాయ్ సిద్దార్థ్‌, జ‌గ‌ప‌తిబాబు వంటి వారు కీల‌క పాత్ర‌ల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. ‘ఆర్.ఎక్స్.100’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన అజ‌య్‌భూప‌తి ఈ చిత్రానికి దర్శకుడు. తాజాగా ఈ చిత్రం నుండీ `రంభ‌.. రంభ‌` అనే మాస్ పాట విడుద‌లై చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ పాట‌లో సీనియర్ స్టార్ హీరోయిన్ రంభ కటౌట్లు ఉండడం విశేషం. అయితే కటౌట్లు ఎందుకు నిజంగా రంభనే ఈ పాటలో పెట్టె ప్రయత్నం దర్శకుడు చేయొచ్చు కదా అనే అనుమానం చాలా మందిలో ఉంది.

నిజానికి అజయ్ భూపతి… రంభ‌కి పెద్ద ఫ్యాన్ అట. రంభ‌ని ఎలాగైనా స‌రే, ఈ మూవీలో చూపించాల‌ని అనుకున్నాడు.అందుకు ఆమెకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ విషయంలో మంచి స్టెప్ వెయ్యాలని.. మంచి పాత్రతో రీ ఎంట్రీ ఇవ్వాలని ఆమె భావిస్తున్నట్టు తెలిపిందట. ఈ నేపథ్యంలో మళ్ళీ ఐటెం గర్ల్ గా చేయడం ఆమెకు ఇష్టం లేదని చెప్పిందట. దీంతో దర్శకుడు లైట్ తీసుకున్నాడు.

కానీ తర్వాత రంభ‌ పై భాస్క‌ర భ‌ట్లతో ఇంట్రెస్టింగ్ పాట‌ని రాయించుకుని మళ్ళీ రంభకి ఫోన్ చేసి మీ పేరు పై మా సినిమాలో పాట పెట్టుకుంటున్నాను అని చెప్పాడట. అందుకు రంభ.. ‘పాటే క‌దా.. పెట్టుకోండి` అంటూ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందట. అలా ఈ పాట తెరకెక్కడం జరిగింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus