Sankranthiki Vasthunam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ వెనుక అసలు నిజాలు..!

2025 సంక్రాంతికి పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ వంటి పెద్ద సినిమాల పక్కన రిలీజ్ అయినప్పటికీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ వసూళ్లు సాధించి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. అంతేకాదు రూ.300 కోట్లు భారీ వసూళ్లు సాధించిన రీజనల్ మూవీస్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి రికార్డులు సృష్టించింది. వెంకటేష్ ప్లస్ పాయింట్స్ ను కరెక్ట్ గా ఉపయోగించుకుని.. బ్లాక్ బస్టర్ డెలివరీ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

Sankranthiki Vasthunam

ఇదిలా ఉంటే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సక్సెస్ గురించి ఇండియా మొత్తం మాట్లాడుకుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఫిలిం మేకర్స్ సైతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాని అక్కడ రీమేక్ చేయాలని భావించారు. అందుకే దిల్ రాజు రీమేక్ రైట్స్ ను అమ్ముకోకుండా.. స్వయంగా హిందీలో ఆ చిత్రాన్ని రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాని రీమేక్ చేస్తున్నట్లు ప్రచారం మొదలైంది.

అనిల్ రావిపూడినే డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు కూడా టాక్ నడిచింది. కానీ వీటిలో నిజం లేదు అనేది తాజా సమాచారం. అక్షయ్ కుమార్ తో దిల్ రాజు సినిమా చేయాలనుకోవడం నిజమే. కానీ అనిల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ ని రీమేక్ చేసే పరిస్థితిలో లేడు. ఆల్రెడీ చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది. మరోపక్క అజీజ్ బాజ్మీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం రీమేక్ కు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మిత్రమండలి’ ఫస్ట్ రివ్యూ.. బాక్సాఫీస్ వద్ద సిక్సు కొట్టేలా ఉందా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus