Sivaji: మంగపతికి లింక్ చేస్తూ శివాజీ ఓల్డ్ వీడియో వైరల్..!

గత శుక్రవారం అంటే మార్చి 14న ‘కోర్ట్’ (Court) సినిమా రిలీజ్ అయ్యింది. నాని (Nani) నిర్మించిన ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకుడు. విడుదలకి 2 రోజుల ముందు నుండి ప్రీమియర్స్ వేశారు. అక్కడి నుండి సినిమాపై పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. రిలీజ్ రోజున జనాలు థియేటర్లకు క్యూలు కట్టారు. ఇది కోర్టు రూమ్ డ్రామా కాబట్టి.. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్.. అందులోనూ క్లాస్ ఆడియన్స్ కి మాత్రమే ఇది పరిమితమవుతుంది అని అంతా అనుకున్నారు.

Sivaji

కానీ ఊహించని విధంగా బి, సి సెంటర్ ఆడియన్స్ కూడా ఈ సినిమాని ఎగబడి చూస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ శివాజీ Sivaji)  పోషించిన మంగపతి రోల్ అని చెప్పాలి. అవును శివాజీ ఇప్పటివరకు చేసిన పాత్రలు ఒక ఎత్తు, కోర్టులో చేసిన మంగపతి పాత్ర ఇంకో ఎత్తు. ఈ పాత్ర సినిమాలో వచ్చిన ప్రతిసారి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక నెగిటివ్ రోల్ ని ఆడియన్స్ ఈ రేంజ్లో రిసీవ్ చేసుకుంటారు అని ఎవ్వరూ ఊహించలేదు.

అయితే స్వతహాగా శివాజీ మంచి నటుడు. సపోర్టింగ్ రోల్స్ చేశాడు, హీరోగా కామెడీ సినిమాలు చేశాడు. కానీ మాస్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసే కెపాసిటీ అతనికి ఉంది అని ఎవ్వరూ అనుకోలేదు. కానీ దర్శకుడు రామ్ జగదీష్, శివాజీలో అంత మాస్ ఉందని ఎలా గుర్తించాడు? ఈ డౌట్స్ చాలా మంది ఆడియన్స్ లో ఉన్నాయి. దానికి సమాధానం ‘బిగ్ బాస్ 7’ అని కొందరు అంటున్నారు. ఒకరోజు హోస్ట్ నాగార్జునతో (Nagarjuna) జరిగిన ఆర్గ్యుమెంట్లో శివాజీ రెచ్చిపోయాడు.

‘హౌస్లో ఉన్న ఆడపిల్లల్ని పీక మీద అడుగేసి తొక్కుతా అనడమేంటి.. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇలానే చేస్తావా?’ అంటూ నాగార్జున గట్టిగా ప్రశ్నిస్తే అందుకు శివాజీ.. ‘మా ఇంట్లో ఆడపిల్లలు అలా చేస్తే నేను కచ్చితంగా గట్టిగా కొడతాను’ అని సమాధానం ఇస్తాడు. దీంతో ‘కోర్ట్’ లో అతని పాత్ర అలాగే పుట్టింది అని దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసి చెబుతున్నారు. అయితే అసలు విషయం రామ్ జగదీషే చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus