వరుస ఫ్లాప్‌లు తర్వాత ఓ హిట్ వస్తే అదే పరమానందం అనుకుంటుంటారు మన హీరోలు, వాళ్ల అభిమానులు. అయితే అలాంటి సిట్యువేషన్‌లో ఇండస్ట్రీ హిట్ వస్తే.. అంతకుమించిన పరమానందం ఇంకేం ఉంటుంది చెప్పండి. అచ్చంగా అలాంటి సినిమానే ‘ఇంద్ర’. చిరంజీవి – బి.గోపాల్ కాంబినేషన్‌లో సి.అశ్వనీత్ రూపొందించిన ఈ సినిమా వసూళ్లు, రికార్డులు, ప్రశంసల గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి సినిమా రీ రిలీజ్ కాకపోవడం ఏంటి? ఈ డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా?
ఇటీవల కాలంలో వరుసగా పాత సినిమాలు రీ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. అలాంటి ట్రెండ్‌లో చిరంజీవి ‘ఇంద్ర’ ఎందుకు లేదు అను ప్రశ్న తప్పకుండా వస్తుంది. కొన్ని నెలల క్రితం ఇదే చర్చ జోరుగా సాగుతున్న సమయంలో నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. నాణ్యత విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని, పూర్తి నాణ్యతతో తప్పక రీ రిలీజ్ చేస్తాం అని చెప్పింది. అయితే ఆ మాట చెప్పి చాలా రోజులైనా ఇప్పటివరకు ఎలాంటి స్పందనా లేదు. దీంతో సోషల్ మీడియా వేదిక నిర్మాణ సంస్థను ప్రస్తావిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని నిర్మాణ సంస్థను ఇబ్బంది పెట్టేవీ కనిపిస్తున్నాయి.
చిరంజీవి చేసిన ఏకైక ఫ్యాక్షన్ సినిమా ‘ఇంద్ర’. రాయలసీమ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా హిందీ డబ్బింగ్ కూడా బ్లాక్ బస్టరే. యూట్యూబ్‌లో ‘ఇంద్ర’ హిందీ వెర్షన్‌ను తెగ చూస్తుంటారు. అయితే ఈ సినిమాను టీవీలో చాలా ఏళ్లుగా టీవీలో కూడా వేయడం లేదు. దీంతో మరోసారి రిలీజ్ చేస్తే చూడటానికి సిద్ధంగా ఉన్నారు ఫ్యాన్స్. గతేడాది ‘ఇంద్ర’ సినిమాకు 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా సినిమాను 4Kలో రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరారు కూడా. ‘మేమూ మెగాస్టార్ అభిమానులమే.. త్వరలో అభిమానుల కోరిక తీరుస్తాం’ అని అన్నారు.
అయితే ఆ మాట అని చాలా రోజులైంది. ఇప్పటివరకూ ఆ దిశగా అడుగు పడింది లేదు. అయితే అశ్వనీదత్‌ను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని ఫ్యాన్స్ అంటున్నారు. అలాగే ఇదే బ్యానర్‌లో వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా విషయంలోనూ చేస్తున్నారనేది అభిమానుల బాధ. ‘ఇంద్ర’ సినిమాను, ‘జగేదక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలను రీ మాస్టర్ చేయడం పెద్ద విషయం కాదు. కానీ ఎందుకు చేయడం లేదనేదే ఇక్కడ ప్రశ్న.
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!