Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఆడిన ఆట ఇది..! శోభాశెట్టి తేజ మద్యలో అసలు నిజాలు ఇవే..!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం శోభా శెట్టి – తేజల మద్యలో టీజింగ్ ప్రేమ ట్రాక్ నడుస్తోంది. ఇదేంటి కొత్తది అనుకుంటున్నారా.. ఇది ప్రేమ ట్రాక్ కాదు, కేవలం లవ్ లాంటి ఫన్ ట్రాక్ అన్నమాట. దీనిని బిగ్ బాస్ స్వయంగా డిజైన్ చేశాడు. బిగ్ బాస్ కి గుర్తు వచ్చినప్పుడల్లా కంటెంట్ తగ్గినప్పుడల్లా వీళ్లిద్దరితో ఆడుకుంటున్నాడు. ముఖ్యంగా కెప్టెన్సీ మారథాన్ టాస్క్ లో తేజని ఒక ఆట ఆడుకున్నాడు బిగ్ బాస్.

కెప్టెన్సీ కంటెండర్ షిప్ త్యాగం చేస్తావా ? లేదా ట్యాటూ వేసుకుంటావా అని లాక్ చేశాడు. దీనికి తేజ బిగ్ బాస్ ని బ్రతిమిలాడుకున్నాడు. ఇక శోభా అయితే వెంట పడింది. నాకు శాక్రిఫైజ్ చేయి అంటూ తేజ చుట్టూ తిరిగింది. శోబా ఆరాట పడుతుంటే , తేజ పోరాటం చేస్తున్నాడు. ఇద్దరి మద్యలో చాలాసేపు ఫన్ జనరేట్ చేశాడు బిగ్ బాస్. అంతేకాదు, శోభా ఫుడ్ ని తినేసి తేజకి పెట్టకుండా చేస్తే, స్వయంగా చపాతీలు చేసి తినిపించమని చెప్పాడు.

చపాతీ బాగుందని చెప్తే ట్యాటూ వేసుకోవాలని కండీషన్ పెట్టాడు. దీంతో లవ్ షేప్ లో ఉన్న రెండు చపాతీలు చేసి శోభాశెట్టి తేజకి ప్రేమగా తినిపించింది. మద్యలో బాగుందని చెప్పేసి తేజ దొరికిపోయాడు. అంతకు ముందు వారం నాగార్జున కూడా ట్యాటూ గురించి తేజని టీజ్ చేశాడు. అలాగే, కేక్ పంపించి మరీ బిగ్ బాస్ ముందుంది ముసళ్ల పండగ అంటూ తేజతో ఆడుకున్నాడు. ఫైనల్ గా టెంపరరీ ట్యాటూ అయితే ఓకే బిగ్ బాస్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

కానీ, బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) కనికరించలేదు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి “వేర్ ఇట్” అనే టాస్క్ లో ఆడారు. ఇందులో తేజ 58 బట్టలు వరకూ వేసుకంటే, శోభాశెట్టి ఏకంగా 72 క్లాత్స్ వేసుకుని టాప్ లో నిలిచింది. ఫైనల్ గా కెప్టెన్సీ పోటీదారులు అయ్యింది. మొత్తానికి హౌస్ లో ఐదుగురు కెప్టెన్సీ రేస్ లో ఉన్నారు. వీరిలో శోబాశెట్టి, ప్రియాంక, సందీప్, ప్రశాంత్, ఇంకా గౌతమ్ లు కెప్టెన్సీ కోసం పోటీ పడబోతున్నారు. మొత్తానికి అదీ మేటర్.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags