2017 లో రానున్న హిట్ చిత్రాల సీక్వెల్స్

రెండున్నర గంటల పాటు సినిమాను చూసిన ప్రేక్షకుడి నోటివెంట .. ఇంతలోనే అయిపోయిందా ..? అనే మాట వస్తే ఆ చిత్రం సూపర్ హిట్ అన్నమాట. ఇంకొంచెం సేపు సినిమా అంటే బాగుంటుంది .. అని కోరిక కలిగిందంటే ఆ దర్శకుడి పంట పండినట్లే. ఆ చిత్రానికి సీక్వెల్ తీయడానికి పరిమిషన్ దొరికినట్లే. అలా ఇప్పటికీ తెలుగులో కొన్ని సీక్వెల్స్ వచ్చాయి. ఈ ఏడాది మరికొన్ని సీక్వెల్స్ ఊరిస్తున్నాయి. వాటికోసం సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

రాజు గారి గది 2బుల్లి తెరలో గేమ్ షోలతో బాగా పాపులర్ అయిన ఓంకార్ దర్శకత్వం వహించిన మూవీ ‘రాజుగారి గది’. తక్కువ బడ్జెట్ తో, యువ నటీనటులతో రూపొందిన ఈ మూవీ పెద్ద హిట్ సొంతం చేసుకుంది. అప్పుడే రాజుగారి గది 2 వస్తుందని ఓంకార్ ప్రకటించారు. దానికి కథ, స్క్రిప్ట్ రెడీ చేసి త్వరలో సెట్స్ పైకి తీసుకుపోవడానికి అంత సిద్ధం చేశారు. రాజు గారి గది సీక్వెల్ పై ఆసక్తి కలగడానికి బలమైన కారణం కింగ్ నాగార్జున. ఆయన ఈ మూవీలో కీలక రోల్ పోషించనున్నారు.

దండుపాళ్యం గ్యాంగ్ 2కర్ణాటకలో ఓ ముఠా చేసిన హత్యలు, వరుస దోపిడీలు వంటి వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు శ్రీనివాసరాజు తీసిన ‘దండుపాళ్యం’ మూవీ కన్నడ, తెలుగు భాషల్లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘దండుపాళ్యం–2’ తీసే పనిలో దర్శకుడు బిజీగా ఉన్నారు. ఇందులో హత్యలు చేసినవారిని పోలీసులు ఎలా పట్టుకున్నారు అనే సీక్రెట్ ని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

గుంటూరు టాకీస్ 2అడల్ట్ కామెడీ షో యాంకర్ రష్మీ కి వెండితెరపై ఎనలేని గుర్తింపును తెచ్చిన చిత్రం గుంటూరు టాకీస్. ఇందులో రష్మీ ని చాలా హాట్ గా చూపించడంలో ప్రవీణ్ సత్తారు విజయం సాధించారు. హిట్ సొంతం చేసుకున్నారు. ఈ సారి మరింత హాట్ గా గుంటూరు టాకీస్ 2 చిత్రాన్ని తెరకెక్కించాలని ఆ చిత్ర నిర్మాత రాజ్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. కథను సిద్ధం చేసిన ఆయన ఇందులో లీడ్ రోల్ కోసం పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ని సంప్రదిస్తున్నారు. ఆమె డేట్స్ ఇస్తే ఈ మూవీ మరో మూడు నెలల్లో థియేటర్లోకి రావడం ఖాయం.

సన్నాఫ్ లేడీస్ టైలర్దర్శకుడు వంశీ, నటకిరీటి రాజేంద్రప్రసాద్ సినీ కెరీర్ లో లేడీస్ టైలర్ మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. వీరి కలయికలో వచ్చిన ఈ చిత్రం నేటి తరం ప్రేక్షకులను సైతం నవ్వుల్లో ముంచుతోంది. అందుకే ఆ కథకు లేటెస్ట్ వెర్షన్ ‘ఫ్యాషన్ డిజైనర్… సన్నాఫ్ లేడీస్ టైలర్’ సినిమా తీస్తున్నారు. యువ హీరో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

విశ్వరూపం 2విశ్వనటుడు కమలహాసన్ అన్నీతానై చేసిన విశ్వరూపం అనేక కష్టాలు ఎదుర్కొని రిలీజ్ అయింది. ఆ చిత్ర షూటింగ్ సమయంలోనే విశ్వరూపం 2 సినిమాకోసం 40 శాతం పూర్తి చేశారు. వెంటనే ఆ చిత్రాన్ని కంప్లీట్ చేసారు. ఈ మూవీ గతఏడాది వస్తుందని అంతా ఎదురుచూసారు. కానీ కొన్ని అడ్డంకులు ఈ చిత్రం థియేటర్ కి రాకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది తప్పకుండా రిలీజ్ అవుతుందని కమల్ అభిమానులు ఆశిస్తున్నారు.

రోబో అప్ గ్రేడ్ఆరేళ్ల క్రితం శంకర్ సృష్టించిన రోబోలో రజనీకాంత్ మూడు వేరియేషన్లో నటించి అదరగొట్టారు. ఈ మూవీ అనేక భాషల్లో విడుదలై సూపర్ సక్సస్ అయింది. దానికి ఇప్పుడు సీక్వెల్ రోబో ‘2.0’ తెరకెక్కుతోంది. 360 కోట్ల భారీ బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్నఈ మూవీలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తుండడం విశేషం.

వీఐపీ 2ఉద్యోగం లేని ఓ బీటెక్ కుర్రాడు క్రియేట్ చేసిన ఫేస్ బుక్ పేజ్ వీఐపీ. ‘రఘువరన్ బీటెక్’ చిత్రంలో ఈ పేజ్ క్లైమాక్స్ లో కీలకం అవుతుంది. ధనుష్ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో భారీ కలక్షన్స్ రాబట్టింది. దీంతో “రఘువరన్ బీటెక్” సీక్వెల్ కి ‘వీఐపీ–2’ని పేరు పెట్టి తెరకెక్కిస్తున్నారు. రఘువరన్ ఈజ్ బ్యాక్… అనే క్యాప్షన్ కూడా ఉంది. ఈ సినిమా ఈ ఏడాది ప్రథమార్ధంలో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో ప్రముఖ హిందీ నటి కాజోల్ సౌత్ ఇండస్ట్రీలోకి రీ–ఎంట్రీ ఇస్తున్నారు.

బాహుబలి 2 బాహుబలి 2 సీక్వెల్ సినిమాకాదు .. రెండో పార్టు మాత్రమే అని దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ముందుగానే స్పష్టం చేశారు. అయినా అభిమానులు దీనికి సీక్వెల్ చిత్రంగా అభవిస్తున్నారు. కట్టప్పను బాహుబలి ఎందుకు చంపాడు? అనే విషయాన్నీ తెలుసుకోవడానికి తహతహ లాడుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఏప్రిల్ 28 న రిలీజ్ కావడానికి ముస్తాబవుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus