మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. విభిన్న కథలను ఎన్నుకుంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ‘బెంగుళూరు డేస్’, ‘ఓకే బంగారం’ ఇలా ఎన్నో హిట్టు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఉన్న మాలీవుడ్ హీరోల్లో దుల్కర్ టాప్ రేంజ్ లో ఉంటాడు. ఆయన సినిమాల కోసం ట్రేడ్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. గతేడాది కరోనా సమయంలో అతడు నటించిన ‘కురుప్’ సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.
దీని తరువాత దుల్కర్ నుంచి రాబోతున్న ‘సెల్యూట్’ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా మూడో వేవ్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో చిత్రబృందం షాకిచ్చింది. ‘సెల్యూట్’ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడం లేదని ప్రకటించింది. సోనీ లివ్ ద్వారా నేరుగా డిజిటల్ రిలీజ్ కి రెడీ చేశారు.
ఈ మేరకు ప్రకటన వచ్చింది. దీంతో దుల్కర్ అభిమానుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమైంది. ఈ సినిమా కోసం కోసం ఎదురుచూస్తోన్న ఎగ్జిబిటర్లకు ఈ నిర్ణయం రుచించలేదు. మోహన్ లాల్ సినిమా ‘ఆరట్టు’, ‘మమ్ముట్టి ‘భీష్మపర్వం’ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఈ క్రమంలో ‘సెల్యూట్’ కూడా విడుదలైతే కలెక్షన్స్ పుంజుకుంటాయని ఆశించారు. కానీ భారీ అంచనాలున్న ఈ మాస్ సినిమాను థియేటర్లలో విడుదల చేయడం లేదని చెప్పడంతో ఎగ్జిబిటర్లకు కోపమొచ్చింది.
ఈ నిర్ణయానికి నిరసనగా ఇకపై దుల్కర్ సినిమాలను థియేటర్లలో ప్రదర్శించేదే లేదని.. అన్ని సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేసుకోవాలని తేల్చి చెప్పింది కేరళ ఎగ్జిబిటర్ల సంఘం. మరి ‘సెల్యూట్’ మేకర్లు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!