చిన్న సినిమా.. పెద్ద విజయం అనే కాన్సెప్ట్ సులభంగా అర్థం కావాలంటే ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి. అయితే గతంలో ఇలాంటి సినిమాలు వచ్చాయా అంటే.. ‘బిచ్చగాడు’ సినిమా పేరు చెబితే చాలు. అంతలా అదిరిపోయింది సినిమా. ఇలాంటి కథతో సినిమా వస్తుందా అనే ప్రశ్న నుండి.. ఇలాంటి కథే బ్లాక్‌బస్టర్ ఇచ్చింది అనే పొగడ్త వరకు ఆ సినిమా హీరో విజయ్ ఆంటోని అన్నీ చూశారు. ఒకానొక సమయంలో ఈ సినిమా విడుదలకు థియేటర్ల వాళ్లు ముందుకు కూడా రాలేదట. ‘బిచ్చగాడు 2’ వస్తున్న నేపథ్యంలో విజయ్ ఆంటోని ఈ విషయాలు చెప్పుకొచ్చారు.
తల్లి ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన ‘బిచ్చగాడు’ సినిమా 2015లో విడుదలై సూపర్ సక్సెస్ అందుకుంది. దానికి సీక్వెల్‌గా ‘బిచ్చగాడు 2’ సినిమా త్వరలో విడుదలవుతోంది. సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలకు డబ్బే ప్రధాన కారణం. కొంతమంది ధనికులు లేనివాళ్లను బానిసలుగానే చూస్తుంటారు. అందుకే ‘బిచ్చగాడు 2’లో డబ్బు గురించే ఎక్కువగా చూపించాను అని చెప్పారు విజయ్ ఆంటోని. ఈ నేపథ్యంలోనే ‘బిచ్చగాడు’ నాటి పరిస్థితుల గురించి కూడా వివరించారు.
సినిమాకు ‘బిచ్చగాడు’ అనే టైటిల్ పెట్టడంపై ఇండస్ట్రీ నుండే వ్యతిరేకత వచ్చింది. గతంలో జరిగిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఇండస్ట్రీ వాళ్లు నన్ను కలసి సినిమా పేరును మార్చమని చెప్పారు. కొంతమంది థియేటర్ వాళ్లు కూడా ఈ సినిమా వేయడానికి అంగీకరించలేదు అని చెప్పాడు. అయితే సినిమా కంటెంట్‌ను తాను బాగా నమ్మానని, దానికి అనుగుణంగానే ఆ సినిమా పేరును కొనసాగించాను అని చెప్పాడు.
అలాగే ‘బిచ్చగాడు 2’.. (Bichagadu) ‘బిచ్చగాడు’ కథకు సీక్వెల్ కాదు అని చెప్పాడు విజయ్ ఆంటోని. తానే కథ రాసుకుని, దర్శకుడిగా, నిర్మాతగా ఈ సినిమా చేశాను అని చెప్పాడు. ఇక ఈ సినిమాను మే 19న విడుదల చేస్తున్నారు. ఇందులో విజయ్ ఆంటోని సరసన కావ్య థాపర్ నటిస్తోంది. మరి తొలి ‘బిచ్చగాడు’ స్టైల్‌లో ఈ సినిమా విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?