Bigg Boss 7 Telugu: అసలు దొంగ గేమ్ ఆడింది ఎవరో తెలుసా ? లైవ్ లో జరిగింది ఇదేనా..!

బిగ్ బాస్ ఇంట్లో ప్రస్తుతం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నడుస్తోంది. దీనికోసం జంటలుగా విడిపోయిన హౌస్ మేట్స్ స్టార్స్ సంపాదించడం కోసం పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా స్మైల్ టాస్క్ లో మూడు స్టార్స్ సంపాదించి గౌతమ్ – శుభశ్రీ జంట లీడింగ్ లో ఉంది. ఆ తర్వాత రెండో ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. యాక్టివిటీ రూమ్ లో తన ప్రెండ్ నిద్రపోతున్నాడని, అతని దగ్గర నా వస్తువులు కొన్ని ఉండిపోయాయ్ అని, వాటికి సంబంధించిన హింట్స్ నేను ఇస్తే వాటిని కలక్ట్ చేసి తీస్కుని రావాలని చెప్పాడు.

దీంతో జంటల్లో ఒక్కొక్కరు యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లారు. మొదట వెళ్లిన బ్యాచ్ లో అమర్ , గౌతమ్ ఇంకా తేజ అక్కర్లేని వస్తువులని కూడా తీసుకుని వచ్చారు. దీంతో బిగ్ బాస్ కి కోపం వచ్చింది. తర్వాత వెళ్లిన పైయిర్స్ లో కూడా ప్రిన్స్, సందీప్, శోభా, శుభశ్రీ అక్కర్లేని వస్తువులు చాలా తెచ్చారు. దీంతో బిగ్ బాస్ టాస్క్ ని మార్చేశాడు. నా వస్తువులు కాకుండా వేరే వస్తువులని తెచ్చిన దాన్ని బట్టీ విజేతని నిర్ణయిస్తానని చెప్పాడు. అతి తక్కువ వస్తువులు తెచ్చిన ప్రశాంత్ ఇంకా శివాజీ జంట విన్నర్స్ గా నిలిచారు.

ఆ తర్వాత శోభ – ప్రియాంకలు రెండోస్థానంలో, గౌతమ్ ఇంకా శుభశ్రీలు ముడో స్థానంలో ఉన్నారు.. అన్నింటికంటే ఎక్కువ వస్తువులు తెచ్చిన ప్రిన్స్, సందీప్ జంటలకి ఏమీ మిగల్లేదు. ఈ టాస్క్ తర్వాత లీడింగ్ లో శివాజీ ఇంకా పల్లవి ప్రశాంత్ లు నాలుగు స్టార్స్ తో గౌతమ్, శుభశ్రీలని ఈక్వల్ చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఇంకో టాస్క్ కూాడ పెట్టాడు. బత్తాయి జ్యూస్ పిండే టాస్క్ లో ఫస్ట్ ఎక్కువ జ్యూస్ పిండిన ప్రిన్స్ జంట విన్నర్స్ గా నిలిచారు.

ఆ తర్వాత సందీప్ ఇంకా అమర్ రెండు స్టార్స్ దక్కించుకోగా, ప్రశాంత్ ఇంకా శివాజీ ఇద్దరూ కూడా ఒక స్టార్ ని కైవసం చేసుకున్నారు. దీంతో టాస్క్ లో లీడింగ్ లో ప్రశాంత్ శివాజీలకి ఏకంగా ఐదు స్టార్స్ ఉన్నాయి. ఆ తర్వాత శుభశ్రీ , గౌతమ్ జంట నాలుగు స్టార్స్, సందీప్ అమర్లకి నాలుగు స్టార్స్, ప్రిన్స్ తేజలకి మూడు స్టార్స్ వచ్చాయి. లీస్ట్ లో శోభ-ప్రియాంకలు ఉన్నారు. ఇక ఆఖరి ఛాలెంజ్ లో లెటర్స్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. మరి ఇందులో ఎవరు గెలుస్తారు. ఈవారం (Bigg Boss) కెప్టెన్సీ పోటీదారులు ఎవరు అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus