Sushanth: పెద్దోళ్ళ నుండి సుశాంత్ కు బర్త్ డే విషెస్.. దశ తిరిగినట్టే !

  • March 18, 2023 / 09:12 PM IST

2008 లో వచ్చిన ‘కాళిదాసు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుశాంత్. అక్కినేని నాగేశ్వరరావు గారి కూతురి బిడ్డ ఇతను. మొదటి సినిమాలో తమన్నాతో జోడీ కట్టాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంది. మొదటి సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతో రెట్టింపు జోష్ తో ‘కరెంట్’ అనే సినిమా చేశాడు. ఈ మూవీ బాగానే ఉంటుంది కానీ.. జనాలకు ఎక్కలేదు. తర్వాత ‘అడ్డా’ అనే సినిమా చేశాడు. ఇది యావరేజ్ గా ఆడింది.

అటు తర్వాత ఇతనితో సినిమాలు చేయడానికి పెద్ద దర్శకులు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో స్టార్ గా ఎదగలేకపోయాడు. ఇక సుశాంత్ ను అందరూ మర్చిపోయారు అనుకుంటున్న టైంలో ‘చి ల సౌ’ ఇతన్ని పైకి లేపింది. అటు తర్వాత ‘అల వైకుంఠపురములో’ సినిమాలో కూడా ముఖ్య పాత్రలో నటించి మెప్పించాడు. ఆ రెండు సినిమాలు ఇచ్చిన ఊపులో ఇప్పుడు రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’ , చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమాల్లో నటిస్తున్నాడు.

ఈరోజు సుశాంత్ పుట్టినరోజు కావడంతో ఈ చిత్రాలను నిర్మిస్తున్న అనిల్ సుంకర, అభిషేక్ పిక్చర్స్ సంస్థలు బర్త్ డే విషెస్ చెప్పాలి. ‘భోళా శంకర్’ సినిమాలో ఇతను కీర్తి సురేష్ .. బాయ్ ఫ్రెండ్ రోల్లో కనిపించబోతున్నాడు. కీర్తి సురేష్ ప్రస్తుతం లీడింగ్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఏదేమైనా ఒకప్పుడు సుశాంత్ ను పట్టించుకోని పెద్దోళ్ళు.. ఇప్పుడు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెబుతుండటం విశేషంగానే చెప్పుకోవాలి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus